
BJP’s Social Media : సోషల్ మీడియా.. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్తంభం అయినా మెయిన్ స్ట్రీమ్ వీడియాను తలదన్నెలా అత్యంత శక్తివంతంగా పనిచేస్తోంది. నాలుగో స్తంభాన్ని గుప్పిట పెట్టుకునేందుకు అధికార పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో పెరిగిన టెక్నాలజీలో సోషల్ మీడియా ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఇక దేశ రాజకీయాల్లో సోషల్ మీడియా మరింత ప్రభావవంతంగా పనిచేస్తోంది. అయితే ఈ సోషల్ మీడియాను దేశంలో బీజేపీ వినియోగించినంతగా ఎవరూ వినియోగించడం లేదు. బీజేపీ సోషల్ మీడియాకు ఉన్నంత ఫాలోవర్స్ మరే పార్టీకి లేకపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు, మరే విపక్ష సోషల్ మీడియా కూడా బీజేపీ సోషల్ మీడియాకు దీటుగా ఎదగలేకపోతోంది.
అన్ని పార్టీలకు స్పెషల్ వింగ్‌లు..
సోషల్ మీడియాతో రాజకీయాలు ప్రారంభించిన నేత నరేంద్రమోదీ. 2014లోనే ఆయన సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకుని బీజేపీ విజయంలో కీలకంగా మారాడు. అంతలా బీజేపీని ప్రజల్లోకి, క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాడు. ఇందుకోసం బీజేపీ అధిష్టానం ప్రత్యేక వింగ్‌నే ఏర్పాటు చేసింది. తన సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అయ్యేలా అందరినీ ప్రోత్సహించింది. దీంతో ఏ కార్యక్రమం చేసిన అది క్షణాల్లో ప్రజల చేతిలో ప్రత్యక్షం అవుతోంది.
జియో రాకతో..
ఇక సోషల్ మీడియా ప్రాధాన్యాన్ని గుర్తించిన మోదీ.. ఇంటర్నెట్‌ను అందరికీ అందుబాటులోకి తేవడానికి జియో నెట్‌వర్క్‌ను మరింత ప్రోత్సహించారు. దీంతో తక్కువ ధరకు ప్రజలకు 4జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో సోషల్ మీడియా వినియోగం పెరిగింది. ఆనడ్రాయిడ్ ఫోన్ ఉన్న వారిలో దాదాపు 40 శాతం మంది బీజేపీ సోషల్ మీడియా ఫాలోవర్స్‌గా మారిపోయారు.
వెనుకబడుతున్న విపక్షాలు..
బీజేపీ సోషల్ మీడియా శక్తివంతంగా మారడం, ఎన్నికల్లో జయాపజయాలను నిర్ణయించే స్థాయిలో సోషల్‌మీడికా ప్రభావితం చేస్తుండడంతో కాంగ్రెస్‌తోపాటు, జాతీయ, ప్రాంతీయ పార్టీలు కూడా 2018లో సోషల్ మీడియా వింగ్‌లు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే బీజేపీ సోషల్ మీడియా వింగ్ పనిచేస్తున్న రేంజ్‌లో పనిచేయలేకపోతున్నాయి. ప్రతీ డెవలప్‌మెంట్‌ను బీజేపీ సోషల్ మీడియా వింగ్ క్షేత్రస్థాయికి తీసుకెళ్తోంది. విపక్షాల వైఫల్యాలను ఎండగట్టడంలోనూ కీలకంగా వ్యవహరిస్తోంది. సెటైర్ల రూపంలో ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఎడిట్‌చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే బీజేపీ వైఫల్యాలను ప్రజాల్లోకి తీసుకెళ్లడంలో విపక్ష సోషల్ మీడియా వింగ్స్ సమసర్థవంతంగా పనిచేయలేకపోతున్నాయి. ఎప్పుడైనా వైఫల్యాలు కాంగ్రెస్ లేదా ఇతర సోషల్ మీడియా వింగ్‌లలో ప్రత్యక్షమైనా.. దానిని తిప్పికొట్టడంలోనూ బీజేపీ సోషల్ మీడియా సమర్థవంతంగా పనిచేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోనూ..
తెలంగాణలో కూడా బీజేపీ సోషల్ మీడియా హల్‌చల్ చేస్తోంది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా.. బీజేపీ సోషల్ మీడియాలా సమర్థవంతంగా పనిచేయడం లేదు. బీఆర్‌ఎస్ ౖÐð ఫల్యాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అవుతోంది. ఇక ఎడిటింగ్ అయితే మామూలుగా ఉండదు. అధికార పార్టీపై విసుగు చెందిన అన్నివర్గాల వారు బీజేపీ సోషల్ మీడియావైపు ఆకర్షితులవుతున్నారు. దీంతో బీఆర్‌ఎస్ సోషల్ మీడియా తెలంగాణలో వెనుకబడే ఉంది. ఇక ఏపీలోనూ బీజేపీ పార్టీ బలంగా లేకపోయినా సోషల్ మీడియా మాత్రం సమర్థవంతంగా పనిచేస్తోంది. అధికార పార్టీ వైఫల్యాలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది.
ఇలా దేశవ్యాప్తంగా తనదైన శైలిలో దూసుకుపోతోంది బీజేపీ సోషల్ మీడియా. పార్టీ విజయంలో కీలకపాత్ర సోషల్ మీడియాది కచ్చితంగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.