https://oktelugu.com/

BJP MP Tejashwi Surya : నెహ్రూ భజన దేనికోసం? ఏమి చేశాడు? అంటూ సంచలన కామెంట్స్ చేసిన బీజేపీ యువ ఎంపీ

తేజశ్వి చెప్పిన మరో విషయం ఏమిటంటే.. స్వాతంత్రానికి పూర్వమే.. నెహ్రూ ప్రధాని కాకముందే భారత దేశం శాస్త్రసాంకేతిక అభివృద్ధికి అడుగులు పడ్డాయని.

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2023 / 09:26 AM IST

    bjp mp tejasvi surya

    Follow us on

    BJP MP Tejashwi Surya  : ఆయన ఓ యువ నాయకుడు.. బెంగళూరు బీజేపీ ఎంపీ.. యువకుడు కావడంతో సహజంగానే ఆయన మాటల్లో ఫైర్‌ ఉంటుంది. యువత అంటే ఫైర్‌ కామన్‌.. కానీ, ఆ యువ ఎంపీలో ఫైర్‌తోపాటు విషయ పరిజ్ఞానం.. భారత చరిత్రపై పట్టు.. దేశ చరిత్రపై అవగాహన కూడా ఉంది. అందుకే ఆయన ఏం మాట్లాడినా విపక్షాలకు దబిడి దిబిడే. ఇక ఆయన బయట చేసే ప్రసంగం వింటే యువతలో రోమాలు నిక్కబొడుచుకోవల్సిందే. అందటి ఇన్‌స్ప్రేషన్‌ స్పీర్‌ ఇస్తారు ఆ ఎంపీ. ఈ ఇంట్రడక్షన్‌తోనే చాలా మందికి ఆయనెవరో అర్థమై ఉంటుంది. యస్‌.. ఆయనే తేజశ్వి సూర్య. ప్రస్తుతం బెంగళూరు ఎంపీగా ఉన్న ఆయన తాజాగా పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చరిత్రను ఎలా కనుమరుగు చేశాలో ఈజీగా అర్థమవుతుంది.

    నెహ్రూ నుంచి రాహుల్‌ వరకు భజనే..
    ‘కాంగ్రెస్‌ ఎంపీలు చేస్తున్నది ఏంటి అంటే.. నెహ్రూ నుంచి మొదలు పెట్టి.. రాహుల్‌ వరకు భజన చేయడమే. వారికి అది ఒక్కటి తప్ప ఏమీ తెలియదు. కానీ, ఈ భజనలో పడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఎంతో మందిని విస్మరిస్తున్నారు.. కాంగ్రెస్‌ భజనలో ఎంతో మంది గొప్పవారు కనుమరుగవుతున్నారు. పాపం ఈ విషయం కాంగ్రెస్‌ నేతలకు కూడా తెలియడం లేదు. భజన అనేదానిని వారసత్వంగా పునికి పుచ్చుకుని కొనసాగిస్తున్నారు’ అని తేజశ్వి యాదవ్‌ ఎద్దేవా చేశారు.

    శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి..
    భాతర దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతోంది. ఇప్పుడు ఇస్రో చంద్రునిపైనే అడుగు పెట్టింది. తర్వలో సూర్యుని గుట్టు తేల్చే పనిలో ఉంది. అనేక అంశాల్లో ప్రపంచంలోని అగ్రదేశాల సరసన నిలిచింది. ఇందుకు కారణం అనేకమంది శాస్త్రవేత్తల కృషి కూడా ఉంది. కానీ, కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఇందుకు కూడా కారణం తొలి ప్రధాని నెహ్రూనే అంటున్నారు. ఇందుకోసం శ్రమించిన శాస్త్రవేత్తలకు ఆ గుర్తింపు ఇవ్వడం లేదు. తాజాగా చంద్రయాన్‌–3 క్రెడిట్‌ను కూడా కాంగ్రెస్‌ తమ ఖాతాల్లో వేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇస్రో నెహ్రూ నెలకొల్పారు కాట్టి చంద్రయాన్‌–3 సక్సెస్‌కు కారణం కాంగ్రెస్‌ అంటున్నారు.

    స్వాతంత్రానికి పూర్వమే శాస్త్రసాంకేతిక అభివృద్ధి..
    ఇక తేజశ్వి చెప్పిన మరో విషయం ఏమిటంటే.. స్వాతంత్రానికి పూర్వమే.. నెహ్రూ ప్రధాని కాకముందే భారత దేశం శాస్త్రసాంకేతిక అభివృద్ధికి అడుగులు పడ్డాయని. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు నెహ్రూ భజనలో పడి విస్మరించారు. కాదు కాదు కనుమరుగు చేశారని వెల్లడించారు. నెహ్రూ ప్రధాని కాకముందే మన దేశంలో సీఎస్‌ఐఆర్‌ ఏర్పాటు అయినట్లు గుర్తుచేశారు. ‘1942లో అప్పటికి మనకు స్వాతంత్రం రాలేదు.. కానీ సైంటిస్టు రామస్వామి మొదలియార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ ఇండియా ఏర్పాటు చేశారు. ఇందుకు శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ సహకరించారు.

    శ్యామాప్రసాద్‌ ముఖర్జీ చొరవతో అనేక ల్యాబ్‌లు..
    ఇక స్వాతంత్య్రం వచ్చాక నెహ్రూ ఏర్పాటు చేసిన తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ తన తాత్కాలిక ప్రభుత్వంలో డాక్టర్‌ ముఖర్జీ కి చోటు కల్పించి పరిశ్రమల మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఈ సందర్భంగా శ్యామాప్రసాద్‌ ముఖర్జీ డీఆర్డీవో, సీఎస్‌ఐఆర్, ఇస్రో, సీఎస్‌ఐ, అనేక పారిశ్రామిక రంగాలకు చెందిన ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. కేవలం రెండేళ్ల కాలంలోనే అనేక పరిశ్రమల స్థాపనకు, పారిశ్రామికరంగం పురోభివృద్ధికి పునాదులు వేశారు. ఆయన కృషి ఫలితంగానే నేడు భారత దేశం పారిశ్రామికంగా పురోభివృద్ధి చెందుతోంది. ఈ విషయం నెహ్రూ ఉంటే చెప్పేవారు. ఇప్పటి నాయకులు ఈ విషయాన్ని దేశ ప్రజలకు తెలియకుండా దాచాలని చూస్తున్నారు’ అని వివరించారు. రామస్వామి మొదలియార్‌
    శాంతి స్వరూప్‌ భట్నాగర్, శ్యామాప్రసాద్‌ముఖర్జీ పేర్లు తెలియకుండా చేస్తున్నారు అని ఆరోపించారు.