BJP vs AAP: ఢిల్లీలో అమలవుతున్న విద్యా విధానం గురించి అమెరికా లో ప్రచురితమయ్యే న్యూయార్క్ టైమ్స్ అనే పత్రికలో ఆ మధ్య ఓ కథనం వెలువడింది. దీన్ని చూపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ జబ్బలు చరుచుకుంది. అసలే కేజ్రీవాల్ గుజరాత్ లో కూడా పాగా వేస్తానంటూ మోడీకి హెచ్చరికలు పంపుతున్నాడు. ఇప్పటికే ఢిల్లీలో అధికారం కోల్పోయి తిక్క మీద ఉన్న బిజెపి నాయకులు ఒక్కసారిగా దీని మూలాలు వెతికే పనిలో పడ్డారు. అదిగో అప్పుడు బయటకొచ్చినయ్ అసలు విషయాలు. అసలు న్యూయార్క్ టైమ్స్ అనే పత్రిక ఓ సో కాల్డ్. అది కూడా బీబీసీ టైపే. ఎప్పుడూ ఇండియా మీద విద్వేషాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుంది. అమెరికా వైట్ హౌస్ లో కాల్పులు జరిగితే సింగిల్ కాలం వార్త కూడా ప్రచురించదు. అదే భారతదేశంలో కరోనా ప్రబలితే దేశం మొత్తం వల్లకాడైందని రాస్తుంది. అది దాని జర్నలిజం ప్రమాణాల స్థాయి. కంట్రిబ్యూటర్లుగా కూడా పనికిరాని వ్యక్తులను రిపోర్టర్లుగా నియమించుకొని వార్తలు రాయిస్తూ ఉంటుంది. అయితే ఆమధ్య ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి న్యూయార్క్ టైమ్స్ రాసిన వార్త కథనం గురించి ఒక మెయిల్ పెట్టాడట! మీరు రాసిన వార్త కథనం వల్ల ఇక్కడ రెండు పార్టీలు కొట్టుకుంటున్నాయని.. దానికి ఆ పత్రిక ఎడిటర్ స్పందిస్తూ “మేము జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తాం. వివిధ దేశాల్లో ఎడ్యుకేషన్ పాలసీ మీద వార్తలు ప్రచురిస్తాం. పైగా మా ఢిల్లీ రిపోర్టర్ ఫీల్డ్ లెవల్లో బాగా కష్టపడి వివరాలు సేకరించి వార్త రాశాడు” అంటూ వెనకేసుకొచ్చాడు “మీరు రాసిన వార్త కథనం స్థానికంగా ప్రచురితమయ్యే ఖలేజా టైమ్స్ లో కూడా వచ్చింది” అనగానే “మేం ప్రచురించిన వార్తలను ఎవరెవరో ప్రచురిస్తూ ఉంటారని” ముగించాడట! ఇవీ ఆ ఇంటర్నేషనల్ పత్రిక జర్నలిజం స్టాండర్డ్స్. అయితే ఢిల్లీలో కేజ్రీవాల్ అమలు చేస్తున్న విద్యా విధానం గురించి న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధి ఎందుకు రాసాడు అనే విషయాలపై బిజెపి నాయకులు కూపీ లాగుతున్నారు. ఈ విషయంలో సదరు పత్రిక రిపోర్టర్ ఎన్జీవోల సహకారం కూడా తీసుకున్నాడు! ఈ కథనం వెనుక బోలెడన్ని చెల్లింపులు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన బిజెపి సోషల్ మీడియా మండిపడుతోంది. దీని వెనుక తతంగాన్ని మొత్తం ఆధారాలతో సహా బయట పెడుతోంది.

కేజ్రీవాల్ తక్కువేమీ కాదు
ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా వివిధ ఎన్జీవోలు భారీగానే సహాయం చేస్తున్నాయి. వివిధ అంతర్జాతీయ సంస్థల నుంచి తనకు నిధులు రావడం, ఓవర్గం వారు మొత్తం ఆయనకు మద్దతు పలకడం ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. పైగా ఆయన కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ లాగానే ప్రజాధనాన్ని వివిధ పత్రికలకు యాడ్స్ రూపంలో ఇస్తూ ఉంటాడు. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన “దేశ్ కి నేతలు” అవుతారా? కేజ్రీవాల్ ప్రకటనలు మరీ ఘోరం. వివిధ భాషల పత్రికల్లో కూడా హిందీలోనే ప్రకటనలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు కేజీ రివర్ కాన్సన్ట్రేషన్ మొత్తం గుజరాత్ మీద పడింది. అందుకే అక్కడ ప్రచురితమయ్యే పత్రికల్లో ఢిల్లీ మోడల్ పేరిట భారీగా ప్రకటనలు గుప్పిస్తున్నాడు. ఖర్చు చేసేది జేబులో నుంచి కాదు. ఎలాగూ ప్రజా ధనమే కాబట్టి.. అది గాలికి పోయే పేలపిండి కాబట్టి!
Also Read: Jagan Delhi Tour: జగన్ ఢిల్లీ ఎందుకెళ్లినట్టు? ఎందుకొచ్చినట్టు?
బిజెపి నాయకులు సుద్ధ పూసలు కాదు

కేజ్రీవాల్ ను బోను లో పెట్టి విమర్శిస్తున్న బిజెపి నాయకులు కూడా ఏం సుద్ధ పూసలు కాదు. బోలెడు మీడియా సంస్థలు బిజెపి నాయకులు చెప్పినట్టే కథనాలు రాస్తున్నాయి. వార్తలు వడ్డించి పాఠకుల మెదళ్ళను తొలిచేస్తున్నాయి. అసలు మీడియా సంస్థలు ఉన్నదే అమ్ముడుపోవడానికి. పార్టీలు ఉన్నదే వాటిని కొనుక్కోవడానికి.. ఇంతోటి దానికి బిజెపి, ఆప్ పరస్పర విమర్శలు చేసుకోవడమే పూర్తి అబ్జర్డ్. అయితే ఈ గాయి గత్తర జరగడానికి అసలు కారణం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న మద్యం పాలసీ విధానం. దీని వెనుక ఉన్న అసలు విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత మద్యం వ్యాపారంలోకి ప్రవేశించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించేందుకే న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనిష్ సిసోడియా తెరపైకి తెచ్చారని వాదనలు ఉన్నాయి. ఇవన్నీ జరుగుతుండగానే సిబిఐ తన పని చేసుకుంటూ పోతోంది. ఈడి కూడా ఎడాపెడా కేసులు పెడుతోంది. కవితపై బిజెపి ఢిల్లీ మాజీ ఎమ్మెల్యేలు మంజిందర్ సింగ్ సిర్సా, పర్వేష్ వర్మ చేసిన ఆరోపణలపై ఇంతవరకు టిఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇవ్వలేదు. కెసిఆర్ ఫ్యామిలీని ఏమైనా అంటే ఊరుకోని బాల్క సుమన్ కూడా మౌనాన్ని ఆశ్రయించాడు. అంటే ఈడి బోడి ప్రతిభవన్ పైన నజర్ పెట్టిందనే అర్థం. పిక్చర్ అబీ బాకీయే మేరా దోస్త్! ఇప్పుడు అమిత్ షా చేతలకు ఇంతకుమించి ఉపమానం అక్కర్లేదు.
Also Read:Lepakshi Knowledge Hub Scam: ‘లేపాక్షి’ స్కాం జగన్ ను ముంచేస్తుందా?


[…] […]
[…] […]