Haryana Election Result 2024: హర్యానా రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 48 స్థానాలను బిజెపి గెలుచుకుంది. సొంతంగా అధికారాన్ని ఏర్పాటు చేసే బలానికి మించి శక్తిని సంపాదించుకుంది. కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలకు పరిమితమైంది. వాస్తవానికి ఎన్నికలు జరిగే సమయంలో కాంగ్రెస్ పార్టీకి వేవ్ కనిపించింది. ఎన్నికలు మూసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చాలా వరకు సర్వే సంస్థలు ప్రకటించాయి. మంగళవారం ప్రకటించిన ఫలితాలలో.. తొలి రౌండులో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన లీడ్ కొనసాగించింది. ఆ తర్వాత తదుపరి రౌండులలో బిజెపి సీన్ లోకి వచ్చింది. రెండవ రౌండ్ నుంచి మొదలుపెడితే కౌంటింగ్ ముగిసే వరకు కాంగ్రెస్ పై లీడ్ కొనసాగించింది. ఫలితంగా 48 స్థానాలలో విజయం సాధించింది. ఈ విజయం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సోషల్ ఇంజనీరింగ్, ఇతర వ్యవహారాలలో బిజెపి కట్టుదిట్టంగా వ్యవహరించింది. అందువల్లే విజయం సాధించిందని రాజకీయ పండితులు చెబుతున్నారు..
బిజెపి అరుదైన రికార్డు
2014, 2019 ఎన్నికల్లో బిజెపి హర్యానాలో గెలిచింది. 2024 లో జరిగిన ఎన్నికల్లోనూ గెలవడం ద్వారా హ్యాట్రిక్ సాధించింది. అసలు ఏ మాత్రం అవకాశాలు లేని చోట విజయ సాధించి సంచలనం సృష్టించింది. అయితే భారతీయ జనతా పార్టీ హార్ట్ సాధించడం ఇదే తొలిసారి కాదు. గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, గోవా రాష్ట్రాలలో కమలం పార్టీ హ్యాట్రిక్ సాధించింది. ఈ జాబితాలో ఇప్పుడు హర్యానా చేరింది. గుజరాత్ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి ఎదురనేదే లేకుండా పోయింది. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలం బిజెపి వరుస విజయాలు సాధించింది. ఆయన ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత కూడా బిజెపి గెలుపులు సాధిస్తూ.. అరదైన రికార్డును సొంతం చేసుకుంది. అయితే భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత హర్యానా రాష్ట్రంలో ఏ పార్టీ కూడా వరుసగా మూడుసార్లు గెలవలేదు. ఆ రికార్డును ఇప్పుడు బిజెపి సాధించి సరికొత్త ఘనతను అందుకుంది.
వాస్తవానికి బిజెపి మూడోసారి హర్యానా రాష్ట్రంలో గెలవదని అందరూ అనుకున్నారు. పది సంవత్సరాలపాటు అధికారంలో ఉండడం.. ఇక్కడ అధికార పార్టీ నాయకుల ఆగడాలు పెరిగిపోవడంతో బిజెపి మూడోసారి అధికారాన్ని దక్కించుకోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా బిజెపి అధికారంలోకి రావడం కష్టమేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. కానీ ఎన్నికల ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి.. గతంలో ఉత్తర ప్రదేశ్, ఇటీవలి చత్తిస్ గడ్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఇలానే ఫలితాలు వెల్లడించాయి. ఆ తర్వాత అక్కడ వాస్తవ ఫలితాలు వేరే విధంగా రావడంతో నాలుక కర్చుకున్నాయి.. సేమ్ హర్యానాలో కూడా ఇలాంటి ఫలితాలే రావడం విశేషం.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Bjp victory in haryana is a new record it is a rare honor to be the first political party in the country
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com