Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu: బాబును నమ్మని బిజెపి అగ్ర నేతలు

Chandrababu Naidu: బాబును నమ్మని బిజెపి అగ్ర నేతలు

Chandrababu Naidu: ఏపీలో పొత్తుల విషయంలో బిజెపి పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి? అంటే మాత్రం ముమ్మాటికీ చంద్రబాబు అని తెలుస్తోంది. గత పాతికేళ్లుగా బిజెపిని అడ్డం పెట్టుకుని ఆయన అధికారంలోకి వచ్చారు. ఓటమి నేపాన్ని మాత్రం బిజెపి పై పెట్టారు. పవర్ లోకి వచ్చిన తర్వాత బిజెపి నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో టిడిపితో పొత్తు పెట్టుకోకూడదని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వివిధ రాజకీయ సమీకరణలతో పొత్తు కుదుర్చుకున్నా.. సీట్ల పరంగా ఎక్కువ స్థానాలు పొందడంతో పాటు పవర్ షేరింగ్ తీసుకోవాలని బిజెపి బలంగా భావిస్తోంది. గతం మాదిరిగా పొత్తులో సింహభాగం ప్రయోజనాలు చంద్రబాబుకు దక్కకుండా చూసుకోవాలని డిసైడ్ అయ్యింది. అందులో భాగంగానే పొత్తుల ప్రకటనలో జాప్యం అని తెలుస్తోంది.

చంద్రబాబును అటల్ బిహారీ వాజపేయి, ఎల్కే అద్వానీ ద్వయం ఎంతగానో నమ్మింది. 1999 నుంచి 2004 మధ్య బాబు ఎన్డీఏలో యాక్టివ్ గా పని చేశారు. అప్పట్లో గుజరాత్ సీఎం గా ఉన్న నరేంద్ర మోడీ, ఆయన మంత్రివర్గంలో ఉన్న అమిత్ షాలు చంద్రబాబు చర్యలు గమనించారు. బిజెపి పెద్దలతో ఏ స్థాయిలో ఆడుకున్నారో కూడా గుర్తించారు. 2014లో బాబుని చేరదీసి టిడిపికి ఊపిరి పోస్తే ఆయన 2019 ఎన్నికల ముందు ఎలా ప్రవర్తించారో కూడా చూశారు. ముఖ్యంగా ఏపీలో బిజెపిని దారుణంగా దెబ్బతీశారని చంద్రబాబుపై బీజేపీ అగ్ర నేతలకు కోపం. 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు, 2023 ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు సహకరించిన తీరుపై బిజెపి పెద్దలకు ఒక స్పష్టత ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ విజయం.. జాతీయస్థాయిలో ఆ పార్టీకి ఊపిరి పోసినట్లు అయింది. అంతటికి చంద్రబాబు కారణమన్నది బిజెపి నేతల అనుమానం.

చంద్రబాబు తమకంటే ఫాస్ట్ గా ఆలోచించడం కూడా బిజెపి అగ్ర నేతల్లో అనుమానానికి కారణం. గత కొద్ది రోజులుగా తమతో పొత్తుకు ప్రయత్నిస్తూనే.. తమ మిత్రుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు తనవైపు తిప్పుకున్నారు. ఆయనతో పొత్తు పెట్టుకున్న తర్వాతే చంద్రబాబు బిజెపి అగ్ర నాయకత్వాన్ని సంప్రదించారు. మూడు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బిజెపి పెద్దలు సూచించారు. సింహ భాగం ఎంపీ సీట్లను తమకు విడిచి పెట్టాలని కోరారు. దీనిపై ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించారు. ఒకవైపు పొత్తుకు తమను పిలిచి ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై బీజేపీ అగ్ర నేతలు కోపంగా ఉన్నట్లు సమాచారం. కష్టకాలంలో ఉన్న టిడిపిని ఊపిరి పోయడం.. తీరా అధికారంలోకి వచ్చాక బిజెపిని చంద్రబాబు నిర్వీర్యం చేయడం పరిపాటిగా మారింది. అందుకే చంద్రబాబుతో పొత్తులు అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితుల్లో బిజెపి నేతలు ఉన్నారు. అందుకే పొత్తులపై పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version