Prashant Kishor: దేశంలో రాజకీయ వ్యూహాలు మారిపోతున్నాయి. బీజేపీ బలం మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నా దాని మనుగడ ప్రశ్నార్థకంగానే మారుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం సాగినా ఆయన ఒక్కసారిగా కాంగ్రెస్ పై వ్యతిరేకంగా మాట్లాడటం సంచలనం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పీకే కాంగ్రెస్ కు పనిచేయడం లేదని అందరిలో అనుమానాలు వస్తున్నాయి.

గత ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడానికి పీకే వ్యూహాలు పనిచేశాయని తెలుస్తోంది. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావంతో బీజేపీ చరిష్మా పెరుగుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీకే కూడా బీజేపీ దశాబ్దాల పాటు దేశంలో అధికారంలో ఉంటుందని చెప్పడం సంచలనం రేపుతోంది. మారుతున్న పరిస్థితుల్లో ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించలేకపోతున్నారని వ్యాఖ్యానించడంతో విశ్లేషకులు ఆలోచనలో పడిపోయారు.
మరోవైపు గతంలో పీకే కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఊహాగానాలు వచ్చినా తరువాత కాలంలో ఆయన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీకే మాటల్లో అర్థం ఏమై ఉంటుందని అందరిలో సంశయాలు ఏర్పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో పీకే సంబంధాలు కట్ చేసుకున్నారా? అనే ఆలోచన అందరిలో వ్యక్తమవుతోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశలు గల్లంతు అనే విషయం అందరికి తెలిసిపోతోంది.
బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ ఇంకా రాలేదని చెబుతున్నారు. దీంతో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే అభిప్రాయం వస్తోంది. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారం చేజిక్కించుకోవడం సులువనే విషయం పీకే మాటల్లో తెలుస్తోంది. దీంతో పీకే వ్యాఖ్యలపై అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది.
Also Read: YSRTP: వైఎస్ఆర్ టీపీ బలోపేతం కోసం టీఆర్ఎస్ కృషి..