Varudu Kaavalenu Movie Review
మూవీ : వరుడు కావలెను
రిలీజ్ డే: అక్టోబర్ 29
నటీనటులు: నాగశౌర్య, రీతువర్మ, మురళీ శర్మ, నదియా, జయప్రకాష్, వెన్నెల కిషోర్
దర్శకులు: లక్ష్మీ సౌజన్య
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ
సంగీతం: తమన్, విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: నవీన్ నూలి.

జీవితంలో ప్రేమ, పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే అతిపెద్ద పండుగ. దాని చుట్టు ఎన్ని కథలు, కథనాలు అల్లినా చూడడానికి అందంగా ఆహ్లాదంగా కనిపిస్తుంది. ‘పెళ్లి చూపులు’ మూవీ నుంచి మొదలుపెడితే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’.. ఈ ‘వరుడు కావలెను’ వరకు పెళ్లి సంబంధాలు, వధూవరుల కష్టాలు కామెడీ నవ్వూలు పూయించేదే. ప్రతీ ఒక్కరి హృదయాన్ని టచ్ చేసేదే.. తాజాగా పెళ్లి, పెళ్లిచూపులు, ప్రేమకథ అంశాలతో వచ్చిన చిత్రం ‘వరుడు కావలెను’. యువ హీరో హీరోయిన్లు నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య తొలి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందనేది రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం..
– కథ:
హీరోయిన్ రీతూ వర్మ (భూమి) చాలా మొండి ఘటంగా ఉండే మహిళ. పెళ్లి చేసుకోకుండా ఆశలు, ఆశయాలు అంటూ పరిగెత్తుతుంది. ఆమె పనిచేసే కంపెనీకి ఆర్కిటెక్ట్ గా వచ్చి నాగశౌర్య .. రీతూ వెంటపడుతుంటాడు. ఒకనొక ఫైన్ మార్నింగ్ చూసుకొని రీతూవర్మకు ప్రేమను వ్యక్తపరుస్తాడు. అయితే హీరోయిన్ రీతూ అతడి ప్రేమను తిరస్కరిస్తుంది. దీనికి ఆమె బలమైన కారణం ఉందని చెబుతుంది. అయితే ఆ కారణం ఏంటనేది హీరో నాగశౌర్యకు చెప్పదు. ఈ ప్రేమ ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటి? ఆకాశ్ ఈ బ్రేకప్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడు అన్నది ప్రాథమిక కథ..
-ప్లస్ పాయింట్స్
వరుడు కావలెను మూవీ ఒక జీవితంలో జరిగిన అందమైన అనుభూతులు, రోమాన్స్ తో సాగుతుంటుంది. ఇది ఒక సాధారణ అబ్బాయి-అమ్మాయి లవ్ స్టోరీ కాదు.. 30 ఏళ్ల జంట మధ్య ఒక మెచ్చుర్డ్ ప్రేమ ఎలా సాగుతుందనేది చూపించాడు. చాలా సెన్సిబుల్ గా క్లాస్ గా మూవీని తీర్చిదిద్దారు.
ప్రస్తుతం ప్రేమకథల విషయంలో నాగశౌర్య టాప్ ఫామ్లో ఉన్నాడు. అతడు తన కొత్త లుక్ తో చాలా అందంగా కనిపిస్తున్నాడు. అద్భుతంగా ఈ సినిమాలో నటించాడు. సినిమా అంతటా నాగశౌర్య సున్నితమైన భావోద్వేగాలను ప్రదర్శించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. నాగశౌర్య పాత్ర సినిమాకు హైలెట్ గా చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ గా నిలిచింది.
ఇక హీరోయిన్ రీతూవర్మ తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. అద్భుతంగా నటించింది. ఆటిట్యూడ్ ఉన్న లేడీగా ఇరగదీసింది. కాటన్ చీరలలో అందంగా కనిపించింది. ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపును అందించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సీనియర్ నటి నదియా, వెన్నెల కిషోర్, సప్తగిరి మంచి కామెడీని పండించారు. హిమజ, ప్రవీణ్ పాత్రలు మెప్పించాయి. మురళీ శర్మ సపోర్టింగ్ రోల్ ను బాగా చేశాడు.
ఈ సినిమా మరో ప్రధాన ఆకర్శణ గణేష్ రావూరి అద్భుతమైన డైలాగ్స్ ఈలలు వేయిస్తాయి. అవి సింపుల్ గా, సెన్సిబుల్ గా ఉంటాయి. సినిమాకు చాలా డెప్త్ ను తీసుకొచ్చాయి. హీరో హీరోయిన్ మధ్య సంభాషణలు సినిమాలకే హైలెట్ గా నిలిచాయి.
-మైనస్ పాయింట్లు
సినిమా స్లో నారేషన్ పెద్ద మైనస్ గా చెప్పొచ్చు. కథ చాలా హృద్యంగా సాగుతోంది. ఇది ప్రేక్షకులలో విసుగును కలిగిస్తుంది. అలాగే పెద్దగా కథలేదని సినిమా చూస్తే తెలుస్తోంది. సెకండాఫ్ స్టోగా సాగుతోంది. కొన్ని హాస్యసన్నివేశాలు అంతగా పేలలేదు.
-సాంకేతిక విలువలు
సినిమా నిర్మాణవిలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. నాగశౌర్య, రీతూవర్మ ఇద్దరూ అద్భుతంగా మాట్లాడారు. కెమెరా పనితనం చాలా బాగుంది. సహాయక నటీనటులు కూడా ఉన్నారు. ఈ చిత్రానికి మరో అసెట్ మంచి సంగీతం.. పాటలు నీట్ గా కంపోజ్ చేయడం వల్ల సినిమా ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలుగలేదు. దర్శకురాలు కొత్త వ్యక్తి అయినా తొలిసారి సినిమా చేసినా ఆకట్టుకునేలా ఉంది. ఆమె రచనలు, పాత్రలు, భావోద్వేగాలు బలంగా ఉంటాయి. అవే సినిమాను నిలబెట్టారు. లవ్ యాంగిల్ మెచ్యూర్ గా హ్యాండిల్ చేశారు. చాలా క్లాస్ తో సినిమాను వివరించారు. అదే సినిమాకు ప్లస్ గా మారింది.
Also Read: Romantic Movie Review: ‘రొమాంటిక్’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?
-తీర్పు
మొత్తానికి ‘వరుడు కావలెను’ మంచి ఎమోషన్స్ తో కూడిన మెచ్చూర్డ్ లవ్ స్టోరీ. నాగశౌర్య, రీతూవర్మ తమ సాలిడ్ పెర్ఫామెన్స్ తో షోను ఆకట్టుకున్నారు. కొంచెం స్లో తప్పితే సినిమా అద్భుతమనే చెప్పాచ్చు. ఇదో సెన్సిబుల్ రోమాన్స్, ఆకట్టుకునే డైలాగులు.. సమయానుకూల పాటలతో ఈ దీపావళి సీజన్ లో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలిచింది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు.
oktelugu.com: రేటింగ్ 3/5