Food challenge: మనలో చాలామంది ఇష్టపడే వంటకాలలో దోశ ఒకటనే సంగతి తెలిసిందే. అయితే దోశ తినడం ద్వారా సులభంగా 71,000 రూపాయలు గెలిచే అవకాశం అయితే ఉంటుంది. కేవలం 40 నిమిషాలలో దోశ తింటే మాత్రమే ఈ ఆఫర్ కు అర్హులు అవుతారు. ఢిల్లీలోని ప్రముఖ రెస్టారెంట్ ఈ ఆఫర్ ను ప్రకటించగా ఈ పోటీలో ఓడిపోతే మాత్రం 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.
వినడానికి బాగానే ఉన్నా ఇప్పటివరకు ఒక్కరు కూడా ఈ పోటీలో విజయం సాధించలేదు. ఢిల్లీలోని శక్తి సాగర్ రెస్టారెంట్ ఈ అద్భుతమైన ఆఫర్ ఉండగా పది అడుగుల దోశను తినడం ద్వారా 71,000 రూపాయలను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఫుడ్ లవర్స్ ఈ పోటీలో పాల్గొనడం ద్వారా సులభంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. 30 కంటే ఎక్కువమంది ఇప్పటివరకు ఈ పోటీలో పాల్గొన్నారని బోగట్టా.
Also Read: కాపులపై వైసీపీ ప్రేమ.. తుని ఘటనలో కేసులు ఎత్తివేత
ప్రముఖ రెస్టారెంట్లు పాపులారిటీ పెంచుకోవాలనే ఆలోచనతో ఇలాంటి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ పోటీలో పాల్గొనడానికి ఢిల్లీకి వేర్వేరు ప్రాంతాల నుంచి తిండిప్రియులు వస్తుండటం గమనార్హం. ఫుడ్ తినడాన్ని అమితంగా ఇష్టపడే వాళ్లు ఈ పోటీలో పాల్గొనడం ద్వారా తమ లక్ ను పరీక్షించుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎంత కష్టపడినా పోటీలో గెలవలేకపోయామని పోటీలో పాల్గొన్న వాళ్లు చెబుతున్నారు.
ఈ పోటీ చెప్పడానికి సింపుల్ గా అనిపించడానికి తినడం మాత్రం అంత తేలిక కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దోశను ఇష్టపడే వాళ్లకు ఈ ఆఫర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: కేసీఆరే టార్గెట్ః బీజేపీ భీమ్ దీక్షలతో చెక్ పెట్టే యత్నం?