వైపీసీని టార్గెట్ చేస్తున్న బీజేపీ?

ఏపీలో ఎలాగోలా బీజేపీ బలపడేందుకు పావులు కదుపుతోంది. ఏపీలో ఒక్క సీటు కూడా లేని బీజేపీ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ధీటుగా పోరాడుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఏపీలో బలపడటానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. ఏపీలో టీడీపీని సీఎం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. టీడీపీలోని ముఖ్యనేతలను బీజేపీ తనవైపు తిప్పుకుంటోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ కు […]

Written By: Neelambaram, Updated On : July 9, 2020 3:29 pm
Follow us on


ఏపీలో ఎలాగోలా బీజేపీ బలపడేందుకు పావులు కదుపుతోంది. ఏపీలో ఒక్క సీటు కూడా లేని బీజేపీ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ధీటుగా పోరాడుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఏపీలో బలపడటానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. ఏపీలో టీడీపీని సీఎం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. టీడీపీలోని ముఖ్యనేతలను బీజేపీ తనవైపు తిప్పుకుంటోంది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ కు సీఎంఓలో అందలం!

బీజేపీలోకి టీడీపీ నేతలను ఆహ్వానిస్తూ టీడీపీని ఏపీలో మరింత బలహీనంగా మారుస్తోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు ముఖ్యనేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ వచ్చే ప్రతిఒక్కరిని కలుపుకుపోతూ పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని బీజేపీ అధిష్టానం పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తుపెట్టుకుంది. పవన్ కల్యాణ్ చరిష్మాను ఓట్ల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఎలాగూ టీడీపీ బలహీనపడటంతో అధికారంలోకి వైసీపీపై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది.

అధికారంలో ఉన్న వైసీపీ గట్టి షాకిచ్చేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. వైసీపీ ఎంపీలను బీజేపీ తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు బీజేపీ రూట్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన పదేపదే వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం ఇందులో భాగమనేనని అర్థమవుతోంది. ఆయనతోపాటు వైసీపీకి చెందిన పలువురు ఎంపీలను బీజేపీ తనవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది. పలువురు ఎంపీలు బీజేపీతో ఇప్పటికే లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కేసీఆర్ ని ఎదుర్కోవడానికి జగన్ ని దించుతారా?

ఏపీకి కేంద్రంలోని బీజేపీ పెద్దఎత్తున సాయం చేస్తుందని స్థానిక బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్రం చేస్తున్న సాయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఓవైపు టీడీపీ నుంచి పెద్దఎత్తున భారీగా నాయకులను ఆ పార్టీలో చేర్చుకుంటూ అధికారంలోని వైసీపీని టార్గెట్ చేస్తోంది. ఒకేసారి ఇరుపార్టీలను టార్గెట్ చేస్తూ ముందుకెళుతోంది. పలువురు వైసీపీ ఎంపీలు ఇప్పటికే బీజేపీ వైపు చూస్తున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల వరకు బీజేపీ ఏపీలో బలపడి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లురుతోంది. ప్రధాని మోదీ, పవన్ చరిష్మాతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే ఆకాంక్షను ఆ పార్టీ నేతలు వెలిబుచ్చుతున్నారు. టీడీపీ, వైసీపీలను దెబ్బకొట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందో లేదో వేచి చూడాల్సిందే..!