హీరో కాకముందే సూపర్ స్టార్ రేంజ్ కి వెళ్లిపోతాడని విపరీతమైన హైప్ ను సంపాధించిన అక్కినేని అఖిల్.. హీరో అయ్యాక సూపర్ స్టార్ మాట పక్కన పెడితే.. స్టార్ డమ్ ను సాధించడానికే కిందామీదా పడుతున్నాడు. ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా ప్లాప్ అయితే ఇక అఖిల్ కి ఇప్పుడు ఉన్న మార్కెట్ కూడా లేకుండా పోతుంది. అందుకే నాగార్జున సైతం ఈ సినిమా పై ముందు నుంచీ విపరీతమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. లాక్ డౌన్ తో ఖాళీ సమయం దొరకడంతో నాగ్ అఖిల్ సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ కు సీఎంఓలో అందలం!
బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న ఈ సినిమా ఎలా వచ్చిందో అని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా ఔట్ పుట్ తెప్పించుకుని, రఫ్ ఎడిటింగ్ అయిన సినిమా మొత్తాన్ని నాగ్ చూసి.. సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్రీ క్లైమాక్స్ విషయంలో కొన్ని మార్పులు చేయమని చెప్పారని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నాగ్ చెప్పిన మార్పులకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను భాస్కర్ పూర్తి చేశాడట. లేటెస్ట్ వెర్షన్ లో చేసిన మార్పుల పట్ల నాగ్ చాల హ్యాపీగా ఫీల్ అయ్యాడట. అన్నపూర్ణ స్టూడియోలో ఆ సీన్స్ ను షూట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఎలాగూ హీరో హీరోయిన్లు మాత్రమే ఉండే సీన్స్ కాబట్టి షూట్ కి కూడా పెద్దగా క్రూ ఆక్కర్లేదు.
కేసీఆర్ ని ఎదుర్కోవడానికి జగన్ ని దించుతారా?
మరి షూట్ ను ఎప్పుడు స్టార్ చేస్తారో చూడాలి. ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ నెల లాస్ట్ వీక్ నుండి షూటింగ్ మొదలుపెట్టాలని ప్లానింగ్ లో ఉన్నారు. ఇక కరోనా దెబ్బకు రిలీజ్ డేట్ అక్టోబర్ లేదా నవంబర్ కు మారే అవకాశం ఉంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. పూజా ఈ సినిమాలో కాస్త ఘాటు కిస్ లు పెట్టడానికి అదనంగా కోటి రూపాయలు డిమాండ్ చేసి తీసుకుందని వార్తలు వచ్చాయి. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. సినిమా రిజల్ట్ తేడా కొడితే.. బొమ్మరిల్లు భాస్కర్ కి ఇక మరో బొమ్మ రావడం కష్టం అయిపోతుంది.