‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ లోనే.. మంచి కిక్ ఉంది. పైగా రాజకీయ నేపథ్యం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో నటించడం.. అసలుకే ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లు ఆశా దీపంగా వెలిగిపోతున్న ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మంచి కమర్షియల్ పొలిటికల్ మూవీ చేయాలనుకోవడం.. ఓవరాల్ గా ఈ సినిమా మొదలు కాకముందే తారక్ ఫ్యాన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా ఈ సినిమా పట్ల ఓ తెలియని ఆకర్షణ ఉందనేది ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చేస్తోన్న కామెంట్స్ ను చూస్తే అర్ధమవుతుంది. పైగా ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎన్టీఆర్ తెలివితేటలను మెచ్చుకోవాలి. ఆర్ఆర్ఆర్ తరువాత తనకు వచ్చే పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తన తరువాత సినిమాలను ప్లాన్ చేసుకున్నాడు.
కేసీఆర్ ని ఎదుర్కోవడానికి జగన్ ని దించుతారా?
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేసి.. కన్నడంలోని ప్రేక్షకులకు ఓన్ అయిపోవడం, డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేసి తమిళ ప్రజానీకం పై తన నటనా చాతుర్యాన్ని ప్రయోగించడం.. ఆ తరువాత ఓ బాలీవుడ్ బడా దర్శకుడితో కూడా ఓ సినిమా ప్లాన్ లో ఉన్నాడట తారక్. ఏమైనా తారక్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. అదే పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన ప్రభాస్ ఆ ఇమేజ్ ని నిలబెట్టుకోవాడానికి చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. మరో పక్క చరణ్ కి ఆ ఇమేజ్ రాబోతుంది. కానీ చరణ్ తరువాత సినిమా ఇప్పుడే చేప్పలేని పరిస్థితిలో ఉన్నాడు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ కు సీఎంఓలో అందలం!
మొత్తానికి ఎన్టీఆర్ ఒక్కడే పాన్ ఇండియా రేంజ్ ను జాగ్రత్తగా మ్యానేజ్ చేసేలా కనిపిస్తున్నాడు. పైగా ఎన్టీఆర్ చూజ్ చేసుకున్న డైరెక్టర్స్.. ఆల్ రెడీ వాళ్ళకంటూ ఓ మార్కెట్ ఉంది. అది కూడా ఎన్టీఆర్ సినిమాలకు ఉపయోగపడుతుంది. ఇక గురూజీ నేటి భిన్నమైన రాజకీయ నేపథ్యంలో చేస్తోన్న సినిమా కూడా ఎన్టీఆర్ కి మంచి హిట్ ఇస్తే.. ఇక తెలుగులో ఎన్టీఆర్ ను మించే హీరో ఉండకపోవచ్చు. ఇక ఈ చిత్రంతో ఎన్టీఆర్ కి మలయాళంలో సాలీడ్ మార్కెట్ క్రియేట్ అవ్వాలని మలయాళీ స్టార్ మోహన్ లాల్ ను తీసుకోవాలనుకుంటున్నారు. త్రివిక్రమ్ ఆయన కోసం ఓ కీలక పాత్రను రాస్తున్నాడట. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అట, అన్నట్టు ఎన్టీఆర్ పాత్ర కూడా రాజకీయాలకి ముడిపడి ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లబోతుంది.