https://oktelugu.com/

బీజేపీ టార్గెట్‌ సాగర్‌‌ : అందుకే కొత్త నేతలు కావాలంట

ఇప్పటికే దుబ్బాక, జీహెచ్‌ఎంసీ గెలుపుతో మంచి ఊపు మీదున్న బీజేపీ.. మరోసారి సాగర్‌‌ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఇక్కడా గెలిచి రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామేనన్న సంకేతాలు మరోసారి ప్రజల్లోకి పంపాలని తాపత్రయ పడుతోంది. అయితే.. ఇందుకు కొత్త కొత్త ఆలోచనలు చేస్తోంది. సొంత పార్టీ నేతల్ని నమ్ముకోవడం లేదు. బయట నుంచి ఎవరు వస్తారా అని ఎదురుచూస్తోంది. ఇది ఆ పార్టీలో కలకలానికి కారణం అవుతోంది. Also Read: మోడీ సార్.. పైసా విదిల్చడు.. ప్రసంగాలు […]

Written By: , Updated On : February 20, 2021 / 04:20 PM IST
Follow us on

BJP
ఇప్పటికే దుబ్బాక, జీహెచ్‌ఎంసీ గెలుపుతో మంచి ఊపు మీదున్న బీజేపీ.. మరోసారి సాగర్‌‌ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఇక్కడా గెలిచి రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామేనన్న సంకేతాలు మరోసారి ప్రజల్లోకి పంపాలని తాపత్రయ పడుతోంది. అయితే.. ఇందుకు కొత్త కొత్త ఆలోచనలు చేస్తోంది. సొంత పార్టీ నేతల్ని నమ్ముకోవడం లేదు. బయట నుంచి ఎవరు వస్తారా అని ఎదురుచూస్తోంది. ఇది ఆ పార్టీలో కలకలానికి కారణం అవుతోంది.

Also Read: మోడీ సార్.. పైసా విదిల్చడు.. ప్రసంగాలు చేస్తాడు

నాగార్జున సాగర్‌లో ఇప్పటివరకూ బీజేపీ పెద్దగా ఓటు బ్యాంకు లేదు. కానీ.. చెప్పుకోదగ్గ నేతలైతే ఉన్నారు. కడారి అంజయ్య యాదవ్ , నివేదితారెడ్డితో పాటు మరో ముగ్గురు నేతలు ఉన్నారు. వీరందరూ ఎవరి స్థాయిలో వాళ్లకు గాడ్ ఫాదర్లు ఉన్నారు. అయితే.. వీరందరూ కాదు.. బయట నుంచి బలమైన నేతను తేవాలని బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో నివేదితా రెడ్డి అనే నేత పోటీ చేశారు. ఆమెకు మూడు వేలలోపు ఓట్లు మాత్రమే వచ్చాయి.

అయితే.. ఇప్పుడు బీజేపీకి కొంత క్రేజ్ వచ్చింది. దీంతో తమ బలంతో ఖచ్చితంగా గెలిచి తీరుతానని.. టిక్కెట్ తనకే ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. సాగర్‌కు తమ పార్టీ తరపున ఇన్‌చార్జిగా సూర్యాపేట నేత సంకినేని వెంకటేశ్వరావును నియమించారు. ఆయన బీసీ నేతకు టిక్కెట్ ఇప్పించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అంజయ్య యాదవ్ వైపు ఆయన మొగ్గు చూపుతున్నారు. దీంతో నివేదితా రెడ్డి భగ్గుమంటున్నారు. నిజానికి అంజయ్య యాదవ్ సర్పంచ్‌గానే గెలవలేదు. అదే విషయాన్ని బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నారు.

Also Read: నష్టపోయాం, మీరే చెప్పారు.. : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి

మరోవైపు.. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి పోటీలో ఉంటున్నారు. టీఆర్ఎస్ తేరా చిన్నప్పరెడ్డికి టికెట్ ఇస్తోందన్న చర్చ నడుస్తోంది. అందుకే బీసీకే టిక్కెట్ ఇవ్వాలని కొంత మంది పట్టుబడుతున్నారు. చనిపోయిన నరసింహయ్య కూడా యాదవ సామాజికవర్గానికి చెందినవారు. అయితే.. బీజేపీ ఈ కుల సమీకరణాల కన్నా.. అభ్యర్థిపై ఎక్కువగా ఫోకస్ చేసుకుంటోంది. చివరికి బీజేపీలో చేరుతానని ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును కూడా పరిశీలిస్తోంది. ఆయన ఇప్పటికే ఎమ్మెల్యే. అయితే రాజీనామా చేయించి.. సాగర్ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందా అని బండి సంజయ్ పరిశీలిస్తున్నారంటున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్