https://oktelugu.com/

టీమిండియా క్రికెటర్లు స్టెప్పులేస్తే ఎలా ఉంటుందో తెలుసా?

ఇంగ్లండ్ పై తొలి టెస్టులో చిత్తయిన ఇండియా రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. ఆ గెలుపు ఉత్సాహం ఆటగాళ్లలో తొణికిసలాడుతోంది. చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో ఓటమి చవిచూసిన కోహ్లీ సేన తర్వాత టెస్టులో 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమానంగా నిలిచింది. మూడో టెస్ట్ ఈనెల 24న అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో జరుగనుంది. ఇప్పటికే ఇరు జట్లూ అక్కడికి […]

Written By:
  • NARESH
  • , Updated On : February 20, 2021 / 04:03 PM IST
    Follow us on

    ఇంగ్లండ్ పై తొలి టెస్టులో చిత్తయిన ఇండియా రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. ఆ గెలుపు ఉత్సాహం ఆటగాళ్లలో తొణికిసలాడుతోంది.

    చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో ఓటమి చవిచూసిన కోహ్లీ సేన తర్వాత టెస్టులో 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమానంగా నిలిచింది.

    మూడో టెస్ట్ ఈనెల 24న అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో జరుగనుంది. ఇప్పటికే ఇరు జట్లూ అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే వారికి వారం రోజుల విశ్రాంతి దొరకడంతో టీమిండియా ఆటగాళ్లు సంతోషంగా గడుపుతున్నారు.

    తాజాగా ఆటగాళ్లంతా ఆనందంగా స్టెప్పులేసిన ఒక వీడియో వైరల్ అయ్యింది. దీన్ని బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు.

    ప్రముఖ తమిళ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలోని ‘వాతి పాటకు’ వీరంతా స్టెప్పులేశారు. అశ్విన్ తోపాటు హార్దిక్ పాండ్యా, కులదీప్ యాదవ్ లు కూడా డ్యాన్స్ చేశారు. మొతేరా స్టేడియంలోని జిమ్ లో వీరంతా ఉత్సాహంగా చిందులేశారు. ఇది చూసి హీరో విజయ్ సంతోషపడుతాడంటూ అశ్విన్ వ్యాఖ్యానించాడు.

    వీడియోను ఈ లింకులో చూడొచ్చు.