KCR- BJP: తెలంగాణలో బీజేపీ ప్రతీకారం మొదలు పెట్టింది. ఈ ప్రతీకార చర్యలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మొదలు పెట్టగా, దానిని పీక్స్‌కు తీసుకెళ్లాలని బీజేపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థలతో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపిన కేసీఆర్‌ను అదే దర్యాప్తు సంస్థలతో కేంద్రం దడదడలాడిస్తోంది. సీఎం కేసీఆర్ ఇంటికే సీబీఐ వచ్చింది. తాజాగా ఎమ్మెల్యే ఎర కేసుకు తెరలేపిన పైలట్ రోహిత్‌రెడ్డికి తాజాగా ఈడీ షాక్ ఇచ్చింది. బెంగళూరు డ్రగ్స్ కేసుకు సబంధించి నోటీసులు ఇచ్చింది. ఈనెల 19న విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
బెంగళూరు డ్రగ్స్ కేసులో పైలెటే కీలకం..
బెంగళూరు డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. బెంగళూరులోని ఓ పార్టీలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిపై గతంలో డ్రగ్స్ కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే అధికారులు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో పైలెటే కీలకమని అప్పట్లో ప్రచారం జరిగింది. కర్ణాటక సర్కార్ దీనికి సబంధించి సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. తాజాగా ఈ కేసును ఈడీ టేకోరవ్ చేయడం సంచలనంగా మారింది.
స్పందించిన పైలెట్..
ఈడీ నోటీసులపై తాండూరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి స్పందించారు. తనకు ఈడీ నోటీసులు అందాయని తెలిపారు. అయితే అందులో ఏముందో ఇంకా చూడలేదు. ఏ కేసుకు సంబంధించి నోటీసులు వచ్చాయన్నది కూడా అందులో పేర్కొనలేదని చెప్పారు. నా బిజినెస్, ఐటీ రిటర్న్స్ , కుటుంబసభ్యుల బ్యాంక్ ఖాతాలకు సంబంధించి వివరాలతో విచారణకు రావాలని మాత్రమే పేర్కొన్నారని తెలపారు. అయితే ప్రస్తుతం బంజారాహిల్స్‌లో ఉన్న రోహిత్ రెడ్డి ఈడీ నోటీసులతో తాండూరుకు బయలుదేరారు. ఆ నోటిసులపై క్షుణ్ణంగా తెలుసుకుఉని న్యాయ నిపుణుల సలహా తీసుకోనున్నట్టు తెలుస్తుంది.
ఓవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. మరోవైపు డ్రగ్స్ కేసు
తెలంగాణలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఫిర్యాదు చేసింది ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి కావడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే రోహిత్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డ్ చేశారు. అయితే ఈ కేసు విచారణ ఓ వైపు నడుస్తుండగా బెంగళూరు డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు రోహిత్ రెడ్డిని టెన్షన్ పెడుతున్నాయి.
సంజయ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం..
బెంగళూరు డ్రగ్స్‌కేసుపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసును తిరిగి బయటకు తీయాలని బండి సంజయ్ ఇటీవల మాట్లాడారు. అయితే బండి మాట్లాడిన కొన్ని రోజులకే ఈడీ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మరి 19న రోహిత్ విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.
మొత్తంగా ప్రతీకారంతో తెలంగాణలో బీజేపీకి చుక్కలు చూపించాలనుకున్న సీఎం కేసీఆర్‌కు.. అసలు పగ, ప్రతీకారం ఎలా ఉంటుందో చూపిస్తోంది కేంద్రంలోని బీజేపీ సర్కార్. ఇది ట్రైలర్ మాత్రమే అని అసలు సినిమా ముందుందని బీజేపీ నాయకులు పేర్కొనడం గమనార్హం.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Bjp started taking revenge on kcr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com