టీడీపీ స్నేహ హస్తానికి నో చెప్పిన బీజేపీ

టీడీపీ ఇచ్చిన స్నేహ హస్తానికి ఎప్పటికీ లొంగమని ఆంధ్రప్రదేశ్ బీజేపీ స్పష్టం చేసింది. తాజాగా పార్టీ ప్రధాన కమిటీ సమావేశం విజయవాడలో జరిగింది. తరచూ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీ తీరుపై ఈ సమావేశంలో చర్చించారు. ఏకగ్రీవంగా బీజేపీ నేతలందరూ ఎప్పటికీ టీడీపీతో పొత్తు ఉండదని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించడం విశేషం. ఇది తెలుగుదేశం పార్టీకి, టీడీపీకి షాకింగ్ గా మారింది. ఏదీ ఏమైనప్పటికీ చంద్రబాబు కుట్రలకు బీజేపీ లొంగడం లేదని ఆ పార్టీ […]

Written By: NARESH, Updated On : June 15, 2021 11:10 am
Follow us on

టీడీపీ ఇచ్చిన స్నేహ హస్తానికి ఎప్పటికీ లొంగమని ఆంధ్రప్రదేశ్ బీజేపీ స్పష్టం చేసింది. తాజాగా పార్టీ ప్రధాన కమిటీ సమావేశం విజయవాడలో జరిగింది. తరచూ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీ తీరుపై ఈ సమావేశంలో చర్చించారు. ఏకగ్రీవంగా బీజేపీ నేతలందరూ ఎప్పటికీ టీడీపీతో పొత్తు ఉండదని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించడం విశేషం. ఇది తెలుగుదేశం పార్టీకి, టీడీపీకి షాకింగ్ గా మారింది. ఏదీ ఏమైనప్పటికీ చంద్రబాబు కుట్రలకు బీజేపీ లొంగడం లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది.

“ఈ మహమ్మారి సమయంలో మాత్రమే షేక్ హ్యాండ్ నిషేధించబడింది. అయితే టిడిపితో షేక్ హ్యాండ్ చేయడాన్ని బిజెపి శాశ్వతంగా నిషేధించింది” అని ఈ సమావేశంలో పాల్గొన్న బిజెపి కార్యకర్త ఒకరు అనడం చర్చనీయాంశమైంది.

కేంద్ర బిజెపి నాయకులతో స్నేహం కోసం చంద్రబాబు చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కానీ సరైన సమయంలో రాజకీయ స్వార్థం చూసుకుంటాడని పేరుగాంచిన చంద్రబాబును నమ్మడానికి బీజేపీలో ఎవరూ సిద్ధంగా లేరని అనుకున్నారట.. వాస్తవానికి, 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు మోదీని గద్దె దించాలని..బిజెపి ఎన్నికలలో ఓడిపోతుందని భావించి చంద్రబాబు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఆ సమయంలో మోదీని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు, కేంద్ర నాయకులు వాటిని బాగా గుర్తుపెట్టుకున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ ఆ పార్టీతో కలవడం.. రాహుల్ ను ప్రధాని చేయడానికి చంద్రబాబు ప్రయత్నించడంతో బీజేపీ పూర్తిగా ఈ పచ్చపార్టీ నేతను పక్కనపెట్టేసింది.

ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి పి మురళీధరన్, జాతీయ కార్యదర్శి శివ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, కన్న లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ పరిణామంతో బీజేపీని తన మిత్రపార్టీగా చేసుకోవాలనుకుంటున్న చంద్రబాబు ఆశలన్నింటికీ తెర పడ్డాయి.