దుబ్బాక ఉప ఎన్నికతో మంచి ఊపు మీద ఉంది బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం. గ్రేటర్‌లోనూ పాగా వేయాలని పావులు కదుపుతోంది. అందుకే.. వీలు దొరికినప్పుడల్లా అధికార పక్షానికి చురకలు అంటిస్తూనే ఉంది. ఇప్పటికే టీఆర్‌ఎస్ ఫైటింగ్ ఇక బీజేపీతోనే అనేది ఎలాగూ ఫిక్స్ అయింది. ఆ మాటను ఏకంగా అధికార పార్టీ నేతలతోనే చెప్పించారు బీజేపీ లీడర్లు. ఇప్పుడు వారిపై విరుచుకుపడేందుకు కసరత్తు చేస్తున్నారు.
Also Read: బండి సంజయ్ అక్కడే తప్పులో కాలేశాడా?
ఇందులో భాగంగా లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ వాడిన నినాదాన్ని వారికే పంచ్ పడేలా కొత్త రైమింగ్ మొదలెట్టేశారు. ‘సారు కారు పదహారు’ అంటూ.. ఎంపీ ఎన్నికల వేళ పదహారు లోక్ సభ స్థానాల్ని గులాబీ కారు ఖాతాలో వేసుకుంటుందని సీఎం కేసీఆర్ పెద్ద పెద్ద డైలాగ్‌లే వినిపించారు. తాజాగా ప్రత్యర్థిపై పంచ్ వేసేందుకు బీజేపీ దీన్నే ఉపయోగిస్తుండడం విశేషంగా మారింది. ‘కారు.. సారు.. ఇక రారు’ అంటూ.. కేసీఆర్ పని అయిపోయిందన్న మాటను సింగిల్ లైన్‌లో వాడేస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో కారును షెడ్డుకు పంపాలంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్.. టీఆర్ఎస్ పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయా పార్టీల నుంచి బీజేపీలోకి వలసలు కూడా ప్రారంభం అయ్యాయి. తాజాగా జరుగుతున్న ఈ గ్రేటర్ ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోందా అని దేశ వ్యాప్తంగానూ ఆసక్తికరంగా మారింది.
Also Read: బీజేపీపై పోరుకు కేసీఆర్ రెడీ.. ప్లాన్ ఏంటి?
మరోవైపు.. టీఆర్ఎస్– మజ్లిస్ దోస్తానాపైనా బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ను మజ్లిస్ చేతిలో పెడితే ఏమవుతుందన్న విషయాన్ని నగర ప్రజలు ఆలోచించాలని కోరుతున్నారు. మెజార్టీ ప్రజల హక్కుల కోసం బీజేపీ బరాబర్ పనిచేస్తుందని తేల్చేసిన బండి.. హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలను అడ్డుకొని తీరుతామన్నారు. పదిహేను నిమిషాలు పోలీసులను పక్కన పెడితే హిందువుల సంగతి చూస్తానన్న మజ్లిస్ నేతతో కేసీఆర్ చెట్టాపట్టాల్ వేసుకొని తిరగటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. వీటన్నింటి నేపథ్యంలో ఈ కొత్త నినాదం కూడా బీజేపీ ఎంతవరకు పనికొస్తుందో డిసెంబర్ 4 నాటి రిజల్ట్స్‌ను బట్టి చూస్తే అర్థమవుతుంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్