ఢిల్లీలో కరోనా వైరస్ ఉధృతి ఆగడం లేదు. దేశం మొత్తంలో నమోదైన కేసుల్లో ఢిల్లీలోనే అత్యధికంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పై తగు నిర్ణయాలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని పార్టీలను ఆహ్వానించారు. అయితే ఈ సమావేశంలో లాక్ డౌన్ కు సంబంధించిన నిర్ణయం తీసుకుంటారా..? అనే చర్చ సాగుతోంది. ఢిల్లీలో మార్కెట్ల బంద్ కోసం అనుమతి ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం అనుమతి కోరిసన సీఎం ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడోనని అందరూ ఎదురుచూస్తున్నారు. కాగా శీతాకాలం ప్రభావంతో నగరంలో వాయుకాలుష్యం అధికంగా ఉంది. దీంతో కరోనా కేసులు కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది