జనవరి కంటే ముందే జైలు నుంచి బయటకు..?

అక్రమాస్తుల కేసులో బెంగుళూరు జైలులో శిక్షను అనుభవిస్తున్న జయలలిత సహచరిణి శశికళ జనవరిలో విడుదల కానున్నట్లు సమాచారం.  రూ. 10 కోట్లు జరిమానా కోర్టుకు చెల్లించడంతో శిక్షకాలం తగ్గి గడువు కంటే ముందే విడుదల కానున్నట్లు శశికళ తరుపున న్యాయవాది సెందూర్ పాండ్యన్ తెలిపారు. దివంగత తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత కు సంబంధించిన ఆస్తుల కేసులో శశికళ 2017 ఫిబ్రవరి 15 నుంచి బెంగుళూరు జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. సత్ప్రవర్తన, పెరోల్ ను అధికంగా వినియోగించుకోకపోవడం, […]

Written By: Suresh, Updated On : November 19, 2020 11:19 am
Follow us on

అక్రమాస్తుల కేసులో బెంగుళూరు జైలులో శిక్షను అనుభవిస్తున్న జయలలిత సహచరిణి శశికళ జనవరిలో విడుదల కానున్నట్లు సమాచారం.  రూ. 10 కోట్లు జరిమానా కోర్టుకు చెల్లించడంతో శిక్షకాలం తగ్గి గడువు కంటే ముందే విడుదల కానున్నట్లు శశికళ తరుపున న్యాయవాది సెందూర్ పాండ్యన్ తెలిపారు. దివంగత తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత కు సంబంధించిన ఆస్తుల కేసులో శశికళ 2017 ఫిబ్రవరి 15 నుంచి బెంగుళూరు జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. సత్ప్రవర్తన, పెరోల్ ను అధికంగా వినియోగించుకోకపోవడం, తదితర కారణాలతో పాటు కోర్టుకు జరిమానా విధింపు చెల్లించడంతో శిక్షకాలం తగ్గిందని పాండ్యన్ తెలిపారు. అయితే నిన్నటి వరకు శశికళ జనవరిలో విడుదల కావచ్చని అనుకున్నారు. అయితే జనవరి కంటే ముందే విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా ఆమె విడుదలపై అన్నా డీఎంకే పార్టీలో ఉత్కంఠ రేపుతోంది.