Homeజాతీయ వార్తలుK Laxman: డా. కే లక్ష్మన్ కు బీజేపీ ఎందుకు రాజ్యసభ సీటు ఇచ్చింది? అసలు...

K Laxman: డా. కే లక్ష్మన్ కు బీజేపీ ఎందుకు రాజ్యసభ సీటు ఇచ్చింది? అసలు కథేంటి?

K Laxman: దేశంలో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి పార్టీ కోసం పనిచేసే వారికి అగ్రతాంబూలం ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ అధికార పార్టీ కావడంతో అభ్యర్థుల ఎంపికలో పోటీ అనివార్యం అవుతోంది. దీంతో నేతలు తమకు అవకాశం ఇవ్వాలని నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని పేచీ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. పార్టీకి ఎంత మేర పనికొస్తారో వారికే పెద్దపీట వేయాలని చూస్తోంది.

K Laxman
K Laxman

తెలంగాణ నుంచి ఒకరికి చోటు దక్కుతుందని అందరూ ఊహించారు. వారి అంచనాల ఫలితంగానే మనకు ఓ అవకాశం లభించడం నిజంగా ఆహ్వానించదగినదే. పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకు గాను రాష్ట్రంలో పార్టీని తగినంత గుర్తింపు ఇచ్చే క్రమంలో వ్యూహాలు ఖరారు చేస్తోంది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది దేశంలో పార్టీ ప్రతిష్ట పెంచాలని భావిస్తోంది దీని కోసమే అహర్నిశలు శ్రమిస్తోంది.

Also Read: Naga Babu North Andhra Tour: నాగబాబుకు ఉత్తరాంధ్ర బాధ్యతలు ఎందుకు? జనసేన ప్లాన్ ఏంటి?

బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కు రాజ్యసభ సీటు కేటాయిస్తూ ఉత్తర ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించేలా అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆది నుంచి పార్టీ కోసం పాటుపడుతున్న లక్ష్మణ్ ను ఎంపిక చేసుకుని చాన్స్ ఇవ్వడం ఆహ్వానించదగినదే. టీఆర్ఎస్ కూడా రాజ్యసభ సభ్యుల ఎంపికలో బీసీకి అవకాశం ఇచ్చినా ధనవంతులకే ప్రాధాన్యం ఇచ్చింది. కానీ బీజేపీ మాత్రం లక్ష్మణ్ ను ప్రకటించి తమ పార్టీ ధనవంతులకు ప్రాధాన్యం ఇవ్వదనే సందేశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తానికి లక్ష్మణ్ కు రాజ్యసభ సభ్యుడిగా చోటు దక్కడంతో తెలుగు రాష్ట్రాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

K Laxman
K Laxman

పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పటికి అండగా ఉంటుందనే ఉద్దేశంతోనే బీజేపీ లక్ష్మణ్ ను తమ అభ్యర్థిగా ప్రకటించిందని తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టిన బీజేపీ పట్టు కోసం ప్రయత్నిస్తోంది. దీని కోసమే లక్ష్మణ్ ను తమ అభ్యర్థిగా ఎంచుకుని తన పంతం నెరవేర్చుకోవాలని ఆలోచిస్తోంది ఉత్తరాదిలో పార్టీ బలంగా ఉన్నా దక్షిణాదిలో మాత్రం ఒక కర్ణాటకలోనే అధికారంలో ఉంది. దీంతో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో తమ ప్రభావం చూపాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. మొత్తానికి బీజేపీ తీసుకునే నిర్ణయంతో పార్టీకి ప్లస్ కానుందా? బీసీ కార్డు ఓటర్లలో ప్రభావితం కానుందా? అనేది అనుమానమే.

మరోవైపు ఏపీలో సీఎం జగన్ రాజ్యసభ కోసం బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్యకు అవకాశం ఇచ్చి బీసీ కార్డు ప్రయోగించడంతోనే బీజేపీ కూడా వారికి చెక్ పెట్టాలనే ఆలోచనతో డాక్టర్ కె. లక్ష్మణ్ కు రాజ్యసభకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో లక్ష్మణ్ తో బీజేపీ వదిలిన బాణం ఏ మేరకు ఫలితం ఇస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Also Read:Financial Crisis Telangana: తెలంగాణలో ఆర్థిక సంక్షోభం.. జీతాలకూ కష్టమే.. నెల గడవాలంటే ఎన్ని వేల కోట్లు కావాలంటే?

Recommended Videos:
జగన్ పై సామాన్యుడు ఫైర్ | Common Man Fires on CM Jagan | Public Opinion on 3 Years of Jagan Ruling
24గంటల కరెంటు పేరుతో పెద్ద స్కాం || MP Bandi Sanjay About KCR Free Current Scam || Ok Telugu
ఎన్టీఆర్ కే సాధ్యం కాలేదు జగన్ ఎంత ? || Public Talk on CM Jagan Government || Ok Telugu

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version