జగన్ సర్కార్ బడ్జెట్ మాయాజాలాన్ని లెక్కలతో కొట్టారు ఏపీ బీజేపీ నేత పార్థసారథి. జగన్ చెప్పే లెక్కలతో.. అమలు చేసే పథకాలకు అసలు పొంతనే లేదని.. కేటాయింపులు లేవని.. నిధులు ఏమయ్యాయని పార్థసారథి చీల్చిచెండాడాడు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో జగన్ సర్కార్ చేస్తున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు.
3 సంవత్సరాల్లో ఏపీ బడ్జెట్లో నవరత్నాలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. ఇక జలయజ్ఞంకు అసలు కేటాయింపులు, బడ్జెట్ నే కేటాయించలేదని విమర్శించారు. కొత్త ప్రాజెక్టులు రాలేదని.. అసలు మెయింటనేన్స్ కు డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాయలసీమకు నీళ్లు ఇస్తానని.. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తానని ఎన్నోసార్లు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటీకీ జగన్ సర్కార్ సీమకు చుక్క నీరు ఇచ్చింది లేదని పార్థసారతి విమర్శించారు. మూడేళ్లుగా రాయలసీమ రైతులు ఎదురుచూస్తున్నారని.. ఒక్క చిన్న ప్రాజెక్ట్ అయినా ఇవ్వండి కోరుతున్నా కూడా జగన్ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. కొన్ని వందల కోట్లు ఖర్చు పెడితే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి అవుతాయని.. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని పార్థసారథి ఏపీ సర్కార్ ను ప్రశ్నించారు.
మద్యపాన నిషేధాన్ని చేస్తానన్న జగన్.. ఇప్పుడు మద్యాన్ని నియంత్రించకపోగా.. ఏరులైపారిస్తూ ఆదాయాన్ని పెంచుకుంటోందని పార్థసారథి విమర్శించారు. ఈరోజు మద్యం ఆదాయాన్ని పెంచుకుంటున్నారు.. గత ఏడాది 11 వేల కోట్ల మద్యం తాగిస్తే ఈ ఏడాది 16వేల కోట్లు టార్గెట్ పెట్టి తాగిస్తున్నారని పార్థసారథి నిప్పులు చెరిగారు. ఇదేనా ఏపీలో మద్య నిషేధం అని మండిపడ్డారు.
-పార్థసారథి వీడియోను కింద చూడొచ్చు..