RRR : ఆర్ఆర్ఆర్ మూవీకి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

RRR : ఆర్ఆర్ఆర్ మూవీకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీపై దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఎప్పటినుంచో ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 25న ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దేశ, విదేశాల్లో ఈ సినిమా విడుదలవుతోంది. అయితే […]

Written By: NARESH, Updated On : March 17, 2022 8:40 pm
Follow us on

RRR : ఆర్ఆర్ఆర్ మూవీకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీపై దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఎప్పటినుంచో ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈనెల 25న ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దేశ, విదేశాల్లో ఈ సినిమా విడుదలవుతోంది. అయితే ఏపీలో టికెట్ రేట్ల పెంపు విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో సినిమా దర్శకుడు , నిర్మాత ఇటీవల జగన్ ను కలిసి వచ్చారు. సినిమా టికెట్ రేటు పెంచుకోవడానికి అనుమతిని అడిగారు.

ఈ క్రమంలోనే సినిమా బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకొని టికెట్ రేట్ల పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. జీఎస్టీ కాకుండా ఈ సినిమా ఖర్చును 336 కోట్లుగా తెలిపిన నిర్మాతలు.. హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ తో కలిపి అది 478 కోట్ల రూపాయలని తెలిపింది. వచ్చిన లాభాల్లో చెరి సగం దర్శకుడు, ప్రొడ్యూసర్ తీసుకోనున్నారు. ఈ మేరకు 12 ఏళ్ల క్రితం డైరెక్టర్ కు నిర్మాత అడ్వాన్స్ ఇచ్చినట్టు పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ.75 రూపాయలు పెంచుకోవడానికి అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 10 రోజుల పాటు ధర పెంచుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో మల్టీపెక్స్ లో ఆర్ఆర్ఆర్ టికెట్ రేటు రూ.250 నుంచి రూ.325 కానుంది.