టీఆర్ఎస్ నేతకు గాలం వేస్తున్న బీజేపీ.. వర్కౌట్ అవుతుందా?

ఉమ్మడి ఆంధప్రదేశ్ సమయంలో రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతల్లో ఆయనొకరు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన ఎన్నికలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవల తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సమయంలో సీఎం కేసీఆర్ ఈ సీనియర్ నేతకు ఇంటికి వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ తో ఎప్పటి నుంచి ఆ నేతకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో ముందస్తు ఎన్నికలకు ముందు ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా […]

Written By: Neelambaram, Updated On : August 21, 2020 7:37 pm
Follow us on


ఉమ్మడి ఆంధప్రదేశ్ సమయంలో రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతల్లో ఆయనొకరు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన ఎన్నికలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవల తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సమయంలో సీఎం కేసీఆర్ ఈ సీనియర్ నేతకు ఇంటికి వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ తో ఎప్పటి నుంచి ఆ నేతకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో ముందస్తు ఎన్నికలకు ముందు ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటికే ఆ నేతకు ఎలాంటి పదవీ లేకపోవడంతో తీవ్ర అంసృప్తితో ఉన్నారని టాక్ విన్పిస్తోంది. దీంతో ఆ నేత ఎవరంటూ టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Also Read: ఆ ఎమ్మెల్యేలను జగన్ నిండా ముంచేశాడు..! ఇంకేం మిగిలిందని?

మండవ వెంకటేశ్వరరావు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవుల్లో పని చేశారు. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేయలేదు. అయితే ఇటీవల లోక్ సభ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కేసీఆర్ తో ఉన్న ఆయన మంచి సంబంధాలు ఉండటంతో మండవ టీఆర్ఎస్ లోకి వెళ్లారు. దీంతో ఆయన ప్రభుత్వం మంచి పదవీ దక్కుతుందని అందరూ భావించారు. అయితే ఆయనకు ఇప్పటి వరకు ఎలాంటి పదవీ లేకపోవడంతో మండవ సైలంటయ్యారు.

అయితే లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓటమితో రాజకీయ సమీకరణాల్లో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం కూడా ఇందూరు జిల్లా నాయకులవైపు పెద్దగా చూసినట్లు కన్పించడం లేదు. ఈ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పుంజుకోవడంతో మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావులకు పదవులు ఖాయమనే ప్రచారం జరిగింది. మండవను రాజ్యసభకు పంపి.. సురేష్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని కేసీఆర్ భావించారు. అయితే అనుహ్యంగా ఎమ్మెల్సీ బరిలోకి కవిత ఎంట్రీ ఇవ్వడంతో సురేష్‌రెడ్డిని కేసీఆర్ రాజ్యసభకు పంపారు. దీంతో మండవకు ఏ పదవీ దక్కలేదు.

Also Read: వారంతా అయిపోయారు ఇప్పుడు వీళ్ళొచ్చారు..! ఎవరి తలరాత మార్చడానికి?

సీఎం కేసీఆర్ మండవకు ప్రభుత్వ సలహాదారు పదవీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో డీఎస్ కు ఇచ్చినట్లుగానే మండవకు పదవీ ఇస్తారనే టాక్ విన్పిస్తుంది. ఒకవేళ డీఎస్ రాజ్యసభకు రాజీనామా చేస్తే ఆ పదవీకి మండవకు కట్టబెట్టాలని చూస్తున్నారు. అయితే డీఎస్ ఇప్పట్లో రాజీనామా చేసేట్లు కన్పించడం లేదు. ప్రస్తుతానికి ఆయనకు ఏ పదవీ లేకపోవడంతో ఆయన అనుచరులు పార్టీ మారాలని సూచిస్తున్నారట.

ఈ పరిణామాలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తుంది. మండవను బీజేపీలోకి లాగేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారట. మండవ లాంటి సీనియర్ నేతలు బీజేపీలోకి వస్తే తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారట. అయితే ఆయన బీజేపీలోకి వెళ్తారా? లేక టీఆర్ఎస్ కొనసాగుతారా? అనేది మాత్రం వేచి చూడాల్సిందే..!