‘గుండె జారి గల్లంతయ్యిందే’ అనే మంచి కామెడీ మూవీతో హిట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొండా విజయ్ కుమార్ కి ఆ తరువాత పెద్దగా టైం కలిసి రాలేదు. నిజానికి ఫస్ట్ సినిమా హిట్ కారణంగానే నాగచైతన్య ‘ఒక లైలా కోసం’ సినిమా ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. కానీ ఆ ఆఫర్ ను కొండా విజయ్ కుమార్ మాత్రం ఉపయోగించుకోలేక.. చైతుకి అట్టర్ ప్లాప్ సినిమాని తీసి చేతిలో పెట్టాడు. దాంతో మనోడి కెరీర్ కూడా సైడ్ కి వెళ్లిపోయింది. ఎట్టకేలకు మళ్లీ చాలా గ్యాప్ తరువాత రాజ్ తరుణ్ హీరోగా కె.కె. రాధామోహన్ నిర్మాణంలో ఒరేయ్ బుజ్జిగా అనే మరో రొటీన్ సినిమా ఒకటి చేస్తున్నాడు. ఈ సినిమాతోనైనా కొండా మళ్ళీ ఫామ్ లోకి వస్తాడని నమ్మకంగా ఉన్నాడు.
Also Read: అవును.. వెంకటేష్ ఫీలింగ్ కరెక్టే !
కాగా ఈ చిత్రం కథ గురించి ఓ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా కథ వెరీ ఇంట్రస్టింగ్ ప్లే తో సాగుతూనే.. లవ్ మిస్ అండర్ స్టాడింగ్ కామెడీతో ఈ సినిమా ఫుల్ కామెడీగా ఉండబోతుందని తెలుస్తోంది. ఒకవిధంగా ‘గుండె జారి గల్లంతయ్యిందే’ చిత్రంలో కూడా ఈ మిస్ అండర్ స్టాడింగ్ కామెడీనే బాగా వర్కౌట్ అయింది. మరి ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే కామెడీ వర్కౌట్ అవుతుందేమో చూడాలి. ఏమైన తనకు హిట్ ఇచ్చిన ఫార్ములాని ఈ డైరెక్టర్ మళ్ళీ గుడ్డిగా ఫాలో ఆవుతున్నట్లు ఉన్నాడు.
Also Read: నానికి షాక్.. రిలీజ్‌కు ముందే ‘వి’ కథ లీక్!
కానీ సినిమాల విషయంలో ఒకసారి వర్కౌట్ అయింది.. మళ్లీ అంత తేలిగ్గా వర్కౌట్ అవ్వదు. అయితే రాజ్ తరుణ్ కి మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది కాబట్టి. సినిమాలో కూడా ‘కామిక్ వే’ స్క్రీన్ ప్లేతోనే సినిమాని నడిపితే.. అప్పుడు కామెడీ హైలైట్ గా నిలిచి.. సినిమాకి ప్లస్ అవొచ్చు. ఇక ఈ లవ్ స్టోరీ విషయానికి వస్తే.. గాలికి తిరిగే ఓ కుర్రాడు తన కన్నా వయసులో పెద్దదైన ఓ అమ్మాయిని ప్రేమిస్తే.. జరిగే కొన్ని నాటకీయ పరిణామాలు ఏమిటనే పాయింట్ తో పాటు, ముదురు భామతో సాగే ప్రేమ సీన్స్ కూడా ఇంట్రస్టింగ్ గా ఉంటాయట.