https://oktelugu.com/

కేజీఎఫ్ లాంటి క్రేజీ యాక్షన్ డ్రామాలో చరణ్ !

‘మహర్షి’తో డైరెక్టర్ వంశీ పైడిపల్లికి సూపర్ హిట్ వచ్చింది. నిజానికి ఈ రేంజ్ హిట్ వచ్చాక…ఆ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. కానీ, అందుకు పూర్తి విరుద్ధంగా వంశీ పరిస్థితి ఉంది. మొదట వంశీ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని ఆశ పడ్డాడు. పర్సనల్ గా మహేష్ బాబుకి వంశీ ఇష్టం కావడంతో.. ఓకే చేద్దాం.. కథ ప్రిపేర్ చేయి అని అభయం ఇవ్వడం.. చివరకు వంశీ చెప్పిన కథ […]

Written By:
  • admin
  • , Updated On : August 21, 2020 / 07:45 PM IST
    Follow us on


    ‘మహర్షి’తో డైరెక్టర్ వంశీ పైడిపల్లికి సూపర్ హిట్ వచ్చింది. నిజానికి ఈ రేంజ్ హిట్ వచ్చాక…ఆ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. కానీ, అందుకు పూర్తి విరుద్ధంగా వంశీ పరిస్థితి ఉంది. మొదట వంశీ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని ఆశ పడ్డాడు. పర్సనల్ గా మహేష్ బాబుకి వంశీ ఇష్టం కావడంతో.. ఓకే చేద్దాం.. కథ ప్రిపేర్ చేయి అని అభయం ఇవ్వడం.. చివరకు వంశీ చెప్పిన కథ మహేష్ బాబుకు నచ్చకపోవడం.. ఆ రకంగా ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేయడం చకచకా జరిగిపోయాయి. మరో కథతో వస్తానని వంశీ కథల పై కూర్చున్నే లోపే.. మహేష్ వంశీకి హ్యాండ్ ఇచ్చి పరుశురామ్ తో సర్కారు వారి పాట అంటూ హడావుడి మొదలెట్టేసాడు.

    Also Read: నానికి షాక్‌.. రిలీజ్‌కు ముందే ‘వి’ కథ లీక్‌!

    దాంతో అయిష్టంగానే వంశీ మహేష్ బాబుని వదిలేసి మిగిలిన స్టార్ హీరోల చుట్టూ కథ పట్టుకుని తిరుగుతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వంశీ తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తున్నాడని.. చరణ్ కూడా వంశీతో సినిమాకి ఒప్పుకున్నాడని.. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి జూమ్ యాప్ లో చరణ్ కి ఫుల్ స్క్రిప్ట్ వినిపించాడని.. చరణ్ కూడా కథ విని బాగుందని చెప్పినట్లు సమాచారం. అయితే త్వరలోనే మెగాస్టార్ కి కూడా కథ చెప్పాల్సి ఉంటుందట. చిరుకి కథ చెప్పి ఒప్పించాకే.. వంశీతో సినిమాకి చరణ్ డిసైడ్ అవుతాడట.

    Also Read: అవును.. వెంకటేష్ ఫీలింగ్ కరెక్టే !

    కాగా వంశీ మాత్రం తాను రాసుకున్న స్క్రిప్ట్ పై నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తిస్థాయి ఎమోషనల్ యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని, ప్రత్యేకంగా చెప్పాలంటే.. కేజీఎఫ్ మూవీలా క్రేజీ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ లో ఈ సినిమా సాగుతోందని.. ముఖ్యంగా చరణ్ కి ఇది మరో పాన్ ఇండియా మూవీలా వంశీ పైడిపల్లి ఈ సినిమాని రూపొందించే ప్లాన్ లో ఉన్నాడని తెలుస్తోంది. పైగా మహర్షి తరువాత వంశీ చేస్తున్న సినిమా కావడం, అటు చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ తరువాత చేసే సినిమా కావడంతో.. మొత్తానికి ఈ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ‘మహర్షి’ బాక్సాఫీస్ వద్ద కురిపించిన భారీ వసూళ్ల వర్షం, ఇప్పుడు చరణ్ తో చేయబోయే సినిమా మార్కెట్ పెరగటానికి బాగా ప్లస్ అవుతోంది.