తిరుపతిలో బీజేపీ ఊపు ఎంత?

రెండు ఎన్నికలతో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పొలిటికల్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. దుబ్బాక ఉప ఎన్నిక.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు బీజేపీకి చాలా వరకు కలిసొచ్చాయి. దీంతో తెలంగాణలో ఇప్పుడు బీజేపీ  బస్తీ మే సవాల్ అంటూ తొడగొడుతోంది. తెలంగాణ నేతలు కూడా సరిహద్దులు దాటి ఆంధ్ర మీద కూడా కామెంట్లు చేసేంతగా ఎదిగారు ఇక తిరుపతి ఎన్నికతో తడాఖా చూపిస్తాం అంటూ బండి సంజయ్ సైతం ప్రకటించారు. జనసేనను కాదని తామే తిరుపతిలో పోటీ చేస్తామని, ప్రతిపక్షంగా […]

Written By: Srinivas, Updated On : March 20, 2021 3:13 pm
Follow us on


రెండు ఎన్నికలతో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పొలిటికల్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. దుబ్బాక ఉప ఎన్నిక.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు బీజేపీకి చాలా వరకు కలిసొచ్చాయి. దీంతో తెలంగాణలో ఇప్పుడు బీజేపీ  బస్తీ మే సవాల్ అంటూ తొడగొడుతోంది. తెలంగాణ నేతలు కూడా సరిహద్దులు దాటి ఆంధ్ర మీద కూడా కామెంట్లు చేసేంతగా ఎదిగారు ఇక తిరుపతి ఎన్నికతో తడాఖా చూపిస్తాం అంటూ బండి సంజయ్ సైతం ప్రకటించారు. జనసేనను కాదని తామే తిరుపతిలో పోటీ చేస్తామని, ప్రతిపక్షంగా ఫస్ట్ ప్లేస్ తమదే అని సవాల్ చేశారు

అయితే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కలలు కరిగిపోయాయి. పట్టభద్రులే బీజేపీకి ఓటు వేయకుంటే.. వ్యవహారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే తెలంగాణ వ్యవహారం ఇలా ఉంటే ఆంధ్రలో మరోలా ఉంది. విశాఖ ఉక్కు వ్యవహారం.. పెట్రోలు ధరలు కలిసి బీజేపీని కనిపించకుండా చేశాయి. కేంద్రం వైఖరితో రాష్ట్రంలోని ఒక్క బీజేపీ లీడర్‌‌ కూడా మాట్లాడే పరిస్థితి కనిపించడం లేదు.

విశాఖలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే బీజేపీ లీడర్లు ఒక్కరు కూడా మాట్లాడలేదు. కనీసం అక్కడ అడుగు కూడా పెట్టలేదు. అక్కడే ఎంపీగా చెసిన పురందరేశ్వరి, హరిబాబు వగైరాలు పనిచేసిన దాఖలాలు లేవు. పెరుగుతున్న ధరలు, పెట్రోలు రేట్లు, విశాఖ ఉక్కు లాంటి వాటిపై తెలుగుదేశం పార్టీ మాట్లాడడం లేదు. మాట్లాడినా వాటిని కూడా వైసీపీ ఖాతాలో వేస్తోంది. కానీ.. సోషల్ మీడియాలో వ్యవహారం చాలా గట్టిగా ఉంది. మోడీ మీద ఈ ధరాఘాతంపై  సెటైర్లు ఇన్నీ అన్నీ కావు. దాంతో జనాలకు నిజం తెలిసివస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో ఏపీ బీజేపీ నాయకులు మౌనం పాటిస్తున్నారు. తిరుపతి బరిలో జనసేన దిగితే పరిస్థితి వేరు. కానీ.. బీజేపీ బరిలో ఉండడంతో ఆ పార్టీ యాక్టివ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.. జనసేన పార్టీ తెలివిగా ఆ బరి నుంచి తప్పుకుంది. బీజేపీనే పోటీలో నిలుస్తోంది. ఏపీలో వ్యతిరేకత చూస్తుంటే  బీజేపీకి మూడో, నాలుగో, ఐదో ప్లేసులో నిలవడం ఖాయమన్న ప్రచారం తిరుపతిలో సాగుతోంది. వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్యనే పోటీ కనిపిస్తోందంటున్నారు. పైగా జనసేన అనుకూరులు కూడా బీజేపీ హ్యాండ్ ఇవ్వడంతో ఆ పార్టీ సైడ్ నిలిచే పరిస్థితులు లేవట.. దీంతో బీజేపీకి కనీసం పరువు కూడా దక్కే పరిస్థితులు లేవని అంటున్నారు.