‘హిట్’ మూవీతో నాని నిర్మాతగా.. విశ్వక్ సేన్ హీరోగా మాంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఈ సినిమా రిమేక్ అవుతోంది. నానికి నిర్మాతగా కాసులు కురిపించింది. ఇప్పుడా మూవీకి కొనసాగింపుగా అదే నాని నిర్మాతగా మారి తీస్తున్న మూవీ ‘హిట్2’.
అయితే ఈసారి హీరో మారిపోయాడు. కథ కూడా మారిపోయినట్టు తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాత అయిన ప్రముఖ టాలీవుడ్ హీరో నాని మళ్లీ నిర్మాతగానే ‘హిట్2’ సినిమా తీస్తున్నారు. ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
ఇందులో కృష్ణదేవ్ (కేడీ) పాత్రలో టాలీవుడ్ హీరో అడివి శేష్ నటించనున్నారు. ఏపీ పోలీస్ టీం ‘కేడీ’ ఆఫీసర్ గా రెండో కేసును టేకప్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘హిట్’. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ అందుకుంది.