MP Aravind: తెలంగాణలో నిజామాబాద్ ఎంపీగా ఎంపీ అరవింద్ గెలవడమే ఒక సంచలనం. ఎందుకంటే తెలంగాణలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ కూతురును ఆయన ఓడించాడు మరీ. అంతటి బలమైన ప్రత్యర్థిని.. అంతే వ్యూహాత్మకంగా నిజామాబాద్ లో ఓడించి సత్తా చాటాడు.
రాజకీయంలోనే కాదు.. మాటల తూటాలు పేల్చడం.. ప్రత్యర్థులను చెడుగుడు ఆడడంలో అరవింద్ ది అందవేసిన చేయి. ఆయన డైలాగులకు సభల్లో, ప్రెస్ మీట్లలో, సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. వైరల్ కూడా అవుతుంటాయి.
అయితే కేవలం రాజకీయ కోణమే కాదు.. నమ్ముకున్న పార్టీ కార్యకర్తల విషయంలో ఎంపీ అరవింద్ లో మానవత్వపు కోణం కూడా ఉందని నిరూపించాడు. నిన్న నిర్మల్ లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సభలో ఈ మేరకు నిరూపితమైంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఎంపీ అరవింద్ అద్భుతాన్ని ఆవిష్కరించారు. బీజేపీ కార్యకర్తల కోసం బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ‘శాశ్వత సంక్షేమ నిధి’ ఏర్పాటు చేశారు. ఇలా ఒక ఎంపీ పార్టీ క్యాడర్ కోసం నిధి ఏర్పాటు చేయడం అనేది ఇప్పటివరకు జరగలేదు. ఒక పార్టీ కానీ.. పార్టీ అధ్యక్షులు కానీ ఇలా చేశారు. ప్రభుత్వంలో ఉన్న అధినేతలు ఇలాంటివి చేశారు. కానీ సొంతంగా ధర్మపురి అరవింద్ చేసిన ఈ పనిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
టీఆర్ఎస్ వంటి కొన్ని పార్టీలు క్యాడర్ కోసం బీమా అమలు చేశాయి. మరికొన్ని పార్టీలు చిన్న మొత్తాల్లో ఆర్థిక సాయం చేసేందుకు నిధి ఏర్పాటు చేసాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఇలా నిధి ఏర్పాటు చేసింది. కానీ ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ఇప్పటివరకు ఇలా చేయలేదు.
పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కోసం , వాళ్ల కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు ధర్మపురి అరవింద్ ముందుకు వచ్చారు. బూత్ స్థాయి కార్యకర్తల కోసం శాశ్వత సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. గెలిచిన తర్వాత కార్యకర్తలను పట్టించుకోని ఈ రోజుల్లో ఎంపీ అరవింద్ మాత్రం వాళ్ల కుటుంబాల బాగు కోసం చేస్తున్న ఈ కృషిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
-ఎంపీ అరవింద్ పథకం వివరాలు
-బీజేపీ పార్టీ సభ్యుడు ఎవరైనా సరే అకాల మరణం చెందితే తక్షణం రూ.1,50,000 ఆర్థిక సాయం అందుతుంది
-పార్టీ సభ్యుడి భార్య పిల్లలకు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే 5000-50,000/-
-పార్టీ సభ్యుడు గృహ ప్రవేశం చేస్తే రూ.20000
-పార్టీ సభ్యుడి కూతురు వివాహం కోసం రూ.20,000