Homeఎంటర్టైన్మెంట్Jr NTR EMK Show: యాక్టింగ్ పక్కనపెట్టి డైరెక్షన్ చేపట్టిన ఎన్టీఆర్.. హీరో ఎవరంటే?

Jr NTR EMK Show: యాక్టింగ్ పక్కనపెట్టి డైరెక్షన్ చేపట్టిన ఎన్టీఆర్.. హీరో ఎవరంటే?

Jr NTR EMK show: Rajamouli and Koratala Siva Feature On EMK

Jr NTR EMK Show: కౌన్ బనేగా క్రోర్‌పతి తెలుగు వెర్షన్ ప్రారంభం అయ్యి కొద్ది రోజులు అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు ఎపిసోడ్ వేదికను ఇద్దరు టాప్ డైరెక్టర్లు పంచుకోనున్నారు. హిందీలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతి ఎంతటి పాపులర్ షోగా మారిందో అందరికీ తెలుసు. ఆ కార్యక్రమం లాంటిదే తెలుగులో కొద్ది రోజుల నుండి ప్రసారం అవుతుంది.

ఎవరు మీలో కోటీశ్వరుడు పేరుతో ప్రారంభం అయిన ఈ కార్యక్రమం రెగ్యులర్ ఎపిసోడ్స్ ఆగస్టు 22వ తేదీ నుండి ప్రసారం అవుతున్నాయి. ప్రారంభ ఎపిసోడ్ కాస్త విభిన్నంగా, ప్రత్యేకంగా తీర్దిదిద్దారు షో నిర్వాహకులు. సోమవారం రాత్రి అంటే సెప్టెంబర్ 20వ తేదీ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పటికే విడుదలై సంచలనం కల్గిస్తోంది. ఆ ప్రోమో లో జూనియర్ ఎన్టీఆర్ పలికిన ” ఇక్కడ లొకేషన్ నాది, డైరెక్షన్ నాది, నేనే బాస్ ఇక్కడ” అనే డైలాగ్ ఇప్పుడు అన్ని సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.

ఎవరు మీలో కోటీశ్వరుడు(Evaru meelo koteeswarudu)ప్రారంభ ఎపిసోడ్‌ను జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr), రామ్‌చరణ్(Ramcharan) పంచుకోవడం విశేషం. ఈ ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలతో రూపుదిద్దుకుంటున్న ఆర్ఆర్ఆర్ మూవీ మరి కొద్దిరోజుల్లో విడుదల కానుంది. ఈలోగా బుల్లితెరపై సందడి చేయడానికి టాప్ డైరెక్టర్లు S.S. రాజమౌళి, కొరటాల శివ సోమవారం సెప్టెంబర్20వ తేదీ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు రానున్నారు.

ప్రారంభ ఎపిసోడ్ రామ్ వర్సెస్ రామ్‌గా(Ram vs Ram) ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో అందరికి తెలుసు. మళ్లీ అలాంటి ఎపిసోడ్ తో అలరించేందుకు సిద్ధమవుతోంది ఎవరు మీలో కోటీశ్వరుడు. ఇంక రాబోయే సోమవారం ఎపిసోడ్ భారీగా టీఆర్పీ నమోదు చేస్తుందనే అంచనా.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version