ఆ గ్రామంలో ఒకరు చనిపోయిన వెంటనే మరొకరు ఎందుకు చనిపోతున్నారో ఎవరికీ తెలియడం లేదు. గ్రామంలో ఎన్నో శాంతులు చేయించినా మరణాలు మాత్రం ఆగడం లేదు. 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ గ్రామంలో చావుల రహస్యం ఏంటో అర్థం కాక గ్రామస్తులలో చాలామంది టెన్షన్ పడుతున్నారు. వరుస మరణాలకు సాక్ష్యాలు ఉండటంతో హేతువాదులు సైతం మరణాలకు కారణాలను తేల్చలేకపోతున్నారు.
వాస్తు నిపుణులకు చూపించినా, వేద పండితులతో పూజా కార్యక్రమాలు చేయించినా గ్రామంలో చావులు మాత్రం ఆగడం లేదు. చనిపోయిన వాళ్లలో ఎక్కువమంది గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు కావడం గమనార్హం. గ్రామంలో పడమర దిక్కులో కాకుండా తూర్పు దిక్కులో అంత్యక్రియలు చేయడం వల్లే ఈ విధంగా జరుగుతోందని ఎక్కువమంది నమ్ముతున్నారు.
గ్రామంలో ఎవరిని కదిలించినా ఈ చావుల గురించి మాట్లాడుతుండటం గమనార్హం. ఈ ఊరికి పిల్లను ఇవ్వడానికి సైతం చాలామంది భయపడుతున్నారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే వాళ్లను పడమర దిక్కుకు తీసుకొని వెళ్లి అంత్యక్రియలు చేయిస్తున్నారు. పడమర దిక్కులో అంత్యక్రియలు చేయించడం వల్లే ఈ విధంగా జరుగుతుందని తూర్పు దిక్కున అంత్యక్రియలు చేయిస్తే ఏ సమస్య ఉండదని కొంతమందిని నమ్ముతున్నారు.