కరోనా భయం వల్ల తెగ తాగేస్తున్న ప్రజలు.. ఏమిటంటే..?

గత కొన్ని నెలల నుంచి ప్రజల మధ్య కరోనా మహమ్మారి గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. దేశంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలకు కొత్త సమస్యలను సృష్టిస్తోంది. గతేడాది డిసెంబర్ నెలలో కరోనా మహమ్మారి ఉధృతి మొదలు కాగా శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన ఒక సర్వేలో కరోనా భయంతో ప్రజలు మద్యం తెగ తాగేస్తున్నారని తేలింది. […]

Written By: Navya, Updated On : November 9, 2020 8:13 pm
Follow us on


గత కొన్ని నెలల నుంచి ప్రజల మధ్య కరోనా మహమ్మారి గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. దేశంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలకు కొత్త సమస్యలను సృష్టిస్తోంది. గతేడాది డిసెంబర్ నెలలో కరోనా మహమ్మారి ఉధృతి మొదలు కాగా శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన ఒక సర్వేలో కరోనా భయంతో ప్రజలు మద్యం తెగ తాగేస్తున్నారని తేలింది.

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కరోనా భయం వల్ల ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరినుంచి సోకుతుందో తెలియని ఈ వైరస్ ప్రజల్లో కొత్త టెన్షన్ లను క్రియేట్ చేస్తోంది. స్నేహితులను, బంధువులను కలవాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా విజృంభించిన తరువాత చాలామంది ఏం కావాలన్నా ఆన్ లైన్ ద్వారానే కొనుగోలు చేస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు.

కరోనా సోకితే స్నేహితులు, బంధువుల నుంచి వివక్షకు గురయ్యే అవకాశం ఉండటంతో బయటకు వెళ్లకపోతే మంచిదని చాలామంది భావిస్తున్నారు. దీంతో కొందరు తీవ్ర ఒత్తిడికి లోనై మద్యానికి బానిసలవుతున్నారని తెలుస్తోంది. అమెరికాలోని మసాచూసెట్స్‌లో ఉన్న మెక్‌లీన్ ఆసుపత్రి వైద్యులు మద్యం వినియోగంపై అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు.

ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని లేకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదమని చెబుతున్నారు. కరోనా దీర్ఘకాలం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు మానసిక ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.