
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నేడు కౌంటింగ్ జరుగుతోంది. శుక్రవారం ఉదయం 8గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ షూరు అయింది. దీంతో 150 డివిజన్ల పరిధిలో పోటీలో ఉన్న 1,122మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలే అవకాశ ఉంది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొనగా ప్రజలంతా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: జీహెచ్ఎంసీ: ప్రారంభమైన కౌంటింగ్, తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేయనున్నారు. పోస్టల్ ఓట్లలో బీజేపీ హవా కొనసాగిస్తుండటంతో గ్రేటర్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు పోలైన పోస్టర్ బ్యాలెట్లను పరిశిలిస్తే బీజేపీ మెజార్టీ స్థానాల్లో బీజేపీ దూసుకెళుతోంది.
హైదర్‌నగర్‌లో బీజేపీకి 3.. టీఆర్‌ఎస్ కు 1.. టీడీపీకి 1 పోస్టల్ ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బోయిన్‌పల్లిలో టీఆర్‌ఎస్ 8.. బీజేపీ 7.. చెల్లనివి 2 వచ్చాయి. భారతినగర్‌లో టీఆర్‌ఎస్ 3.. బీజేపీ 4.. నోటా 1.. చెల్లనివి 3గా పోలయ్యాయి. గచ్చిబౌలిలో టీఆర్‌ఎస్ 3.. బీజేపీ 5.. శేరిలింగంపల్లిలో బీజేపీ 5.. టీఆర్‌ఎస్ కు 3 వచ్చాయి.
గాజులరామారం..గచ్చిబౌలి.. శేరిలింగంపల్లిలో బీజేపీ ఆధిక్యంలో ఉండగా బోయిన్‌పల్లిలో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉంది. ఇక జీడిమెట్లలో టీఆర్ఎస్ 4.. బీజేపీ 6.. రంగారెడ్డి డివిజన్లో టీఆర్ఎస్ 2.. బీజేపీ 3.. మాదాపూర్లో టీఆర్ఎస్ 1.. బీజేపీ 2.. మియాపూర్.. టీఆర్ఎస్ 1.. కాంగ్రెస్ 1.. హఫీజ్‌పేట్లో బీజేపీ 4 పోస్టల్ ఓట్లు దక్కాయి.
Also Read: మధ్యాహ్నం వరకే జీహెచ్ఎంసీ ఫలితాలు రానున్నాయా?
చందానగర్లో బీజేపీ 2.. టీఆర్ఎస్ 1.. వనస్థలిపురంలో టీఆర్ఎస్ 2.. బీజేపీ 5.. నోటా 1.. హస్తినాపురంలో బీజేపీ 2.. చెల్లనివి 5గా పోలయ్యాయి. ఇక చంపాపేటలో బీజేపీ 5.. టీఆర్ఎస్ 2.. కాంగ్రెస్ 1.. లింగోజిగూడలో బీజేపీ 5.. టీఆర్ఎస్ 1.. కాంగ్రెస్ 3.. టీజేఎస్‌పీ 1.. నాగోల్లో బీజేపీ 13.. టీఆర్ఎస్ 12.. కాంగ్రెస్ 1 ఓట్లు పోలయ్యాయి.
మన్సూరా బాద్ డివిజన్ లో బీజేపీ 8.. టీఆర్ఎస్ 6.. హయత్‌నగర్లో బీజేపీ 8.. టీఆర్ఎస్ 1.. కాంగ్రెస్ 1.. బీఎన్ రెడ్డి నగర్లో బీజేపీ 9.. టీఆర్ఎస్ 10 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉండగా టీఆర్ఎస్ వెనుకంజలో ఉంది. అక్కడక్కడ కాంగ్రెస్ పోస్టల్ ఓట్లను దక్కించుకుంది. పోస్టల్ ఓట్ల ట్రెండ్ బ్యాలెట్ పత్రాల ఓటింగులో కొనసాగుతుందో లేదో వేచిచూడాల్సిందే..!
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్