Jagan: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కడప జిల్లాలలోని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడాన్ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో ప్రకటించడంపై వైసీపీ నేతలు తప్పుపట్టడంతో బీజేపీ నేతలు కూడా స్పందించారు. రాష్ర్టంలో జరుగుతున్న విషయాలపై కేంద్ర మంత్రికి అవగాహన ఉండదా అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాని అవాకులు చెవాకులు పేలుతూ వైసీపీ నేతల ఉపన్యాసాలు ఎవరు వినేందుకు సిద్ధంగా లేరని చెబుతున్నారు.
అన్నమయ్య డ్యామ్ గురించి సమాచారం కేంద్రం దగ్గర ఉండటంతోనే ఆయన దాని గురించి వివరించినట్లు తెలుస్తోంది. కానీ మన రాష్ర్ట నాయకులకు తెలియదు కేంద్ర మంత్రికి ఇంత సమాచారమెక్కడిదనే అనుమానంతోనే కేంద్ర మంత్రి ప్రకటనపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. దీంతో దొరికిపోతున్నారు. రాష్ర్టంలో సర్వే చేసిన కేంద్ర బృందం సమగ్ర వివరాలు ఇచ్చిందనే విషయం మరచిపోతున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులు ఇవ్వడం లేదని ప్రచారం చేయడం తగదు. రాష్ర్టం సూచించిన అంచనాల ప్రకారమే నిధులు విడుదల చేసినా కేంద్రంపై విమర్శలు చేయడం సహేతుకం కాదని బీజేపీ నేతలు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు అంచనాల మేరకే నిధుల కేటాయించినట్లు తెలుస్తోంది. కానీ రాష్ర్ట ప్రభుత్వం మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్లు మట్లాడటం సమంజసం కాదు.
Also Read: AP Govt: రియల్ ఎస్టేట్ వ్యాపారం పై జగనన్న హోసింగ్ పేరిట మరో బాదుడు!
వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలతో ఇరుకున పడుతోంది వారే. అవగాహన రాహిత్యంతో చేసే విమర్శలు వారికే మచ్చ తెస్తున్నాయి. పూర్తి స్థాయి అవగాహన లేకపోతే ఇలాగే ఉంటుంది. అభాసుపాలయ్యే అవకాశాలుంటాయి. కానీ నేతలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమకు తెలిసిందే వేదంగా భావిస్తున్నారు. ఎప్పుడు ఇలాగే తప్పుడు లెక్కలు చెబితే మొదటికే మోసం వస్తుందని గ్రహించుకోవాలి. ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ తప్పులు తెలుసుకుని మాట్టాడితే బాగుంటుందని బీజేపీ నేతలు సూచిస్తున్నారు.
Also Read: Teenmaar Mallanna: కేసీఆర్ ను రాజకీయ సమాధి చేసేస్తాం.. బండి సంజయ్, తీన్మార్ మల్లన్న శపథం