https://oktelugu.com/

Katrina: కత్రినా కారు ఆపిన ట్రాఫిక్​ పోలీస్​.. నెట్టింట్లో వీడియో వైరల్​

Katrina: బాలీవుడ్​లో ప్రస్తుతం ట్రెండింగ్​ టాపిక్​నా నిచించారు కత్రినా విక్కీ కౌశల్​. వీరిద్దరు గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఏడాది డిసెంబరు 7 నుంచి 10లోపు వీరి వివాహం జరగనున్నట్లు బాలీవుడ్​ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సంగీత్​, మెహందీలతో పాటు.. విక్కీ, కత్రినాల వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. అనంతరం 10న రిసెప్షన్​ జరగనుందని టాక్ నడుస్తోంది. వీరి పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్​మీడియాలో తెగ ప్రచారం నడుస్తోంది. కానీ, ఈ విషయంపై […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 03:27 PM IST
    Follow us on

    Katrina: బాలీవుడ్​లో ప్రస్తుతం ట్రెండింగ్​ టాపిక్​నా నిచించారు కత్రినా విక్కీ కౌశల్​. వీరిద్దరు గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఏడాది డిసెంబరు 7 నుంచి 10లోపు వీరి వివాహం జరగనున్నట్లు బాలీవుడ్​ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సంగీత్​, మెహందీలతో పాటు.. విక్కీ, కత్రినాల వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. అనంతరం 10న రిసెప్షన్​ జరగనుందని టాక్ నడుస్తోంది. వీరి పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్​మీడియాలో తెగ ప్రచారం నడుస్తోంది. కానీ, ఈ విషయంపై అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. కాగా, ఇటీవలే డిసెంబరు 5న కత్రినా, విక్కీ సాధారణంగా ముంబయి రోడ్లపై దర్శనమిచ్చారు. జిమ్​కు కలిసి వెళ్లిన వీరి ఫొటోలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే మరిన్ని వీడియోలు ప్రస్తతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

    https://www.instagram.com/reel/CXGFgmxKn9v/?utm_source=ig_web_copy_link

    కాగా, ఓ వీడియోలే కత్రినా కారును ట్రాఫిక్​ పోలీసు ఆపి.. తనిఖీ చేయడానకి ముందుకు వచ్చాడు. డ్రైవింగ్​ సీట్​ దగ్గరకు వచ్చి.. కిటికీలోంచి లోపలికి చూసి.. కత్రినా కైఫ్​ను చూసి షాక్​ అయిపోయాడు. పోలీసు డ్రైవర్​తో మాట్లాడి ఓకే చేసి కారును పంపించేశారు. అయితే, కత్రినా పెళ్లి గురించి ప్రస్తుతం చర్చ జరుగుతున్న వేళ.. ట్రాఫిక్ పోలీసులు కారు తనిఖీ చేయడాన్ని చూసి జనం ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కత్రినా, విక్కీ కౌశల్​ పెళ్లి గురించి సరదాగా కామెంట్​ చేస్తూ.. త్వరగా తీపి కబురు చెప్పాలని కోరారు.