https://oktelugu.com/

Uttarakhand: ముస్లింను పెళ్లి చేసుకోనున్న బీజేపీ నాయకుడి కూతురు.. వెడ్డింగ్ కార్డు వైరల్

బీజేపీ మద్దతుదారులు, ప్రత్యర్థులు బెనామ్‌ను విమర్శించడంతో వెడ్డింగ్ కార్డును ఫొటోను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : May 19, 2023 5:50 pm
    Uttarakhand

    Uttarakhand

    Follow us on

    Uttarakhand: బీజేపీ నాయకుడి కూతురు ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోనుంది; పెళ్లి కార్డు వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీకి చెందిన బీజేపీ నాయకుడి కుమార్తె ముస్లిం వ్యక్తితో సిద్ధమైంది. వారి పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఉత్తరాఖండ్‌కు చెందిన యశ్‌పాల్‌ బెనమ్‌ కూతురు పెళ్లికూతురు. తన కూతురు ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో సదరు నాయకుడిపై జనాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    బీజేపీ మద్దతుదారులు, ప్రత్యర్థులు బెనామ్‌ను విమర్శించడంతో వెడ్డింగ్ కార్డును ఫొటోను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కరుడు గట్టిన హిందూత్వవాది మాజీ ఎమ్మెల్యే, కాషాయ పార్టీభారీగా ట్రోల్ అవుతునన్నది. మరికొందరు ఈ వివాహాన్ని ఇటీవల విడుదలైన వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీస్‌తో పోల్చుతూ “లవ్ జిహాద్” అని పిలుస్తున్నారు .

    “బీజేపీ పాలిత రాష్ట్రాలు ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నాయి. ఇక్కడ బీజేపీ నాయకుడి కుమార్తె ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోనుండడంతో బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని నెటిజన్లు సోషల్ మీడియా లో విమర్శలు గుప్పిస్తున్నారు. “లవ్ జిహాద్” పదానని బీజేపీ, మితవదులు తరచూ ఉపయోగించే పదం, హిందూ స్త్రీలను వివాహం ద్వారా మత మార్పిడి చేయడానికి ముస్లిం పురుషులు చేసిన పన్నాగంగా కాషాయవాదుల ఆరోపిస్తు్న్నారు.

    ఈ విషయమం పై పౌరీ ఆలయ కమిటీ బాధ్యులు ఆందోళన చెందుతున్నట్లు మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. హిందూ కుటుంబాల కుమార్తెలను ఇతర మతాలకు చెందిన పురుషులతో వివాహం హిందూ వ్యవస్థను దెబ్బతీయడంలో భాగమేనని పలువురు ఆరోపిస్తున్నారు. విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌కు చెందిన వారు దీనిని వ్యతిరేకించాలని కోరుతున్నారు. హిందువుల రక్షణ కోసం పోరాడే బీజేపీ అలాంటి వారిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. యశ్‌పాల్ బెనమ్‌ కుమార్తె లక్నో విశ్వవిద్యాలయంలో చదివిందని, ఆమె వివాహం చేసుకోబోయే వ్యక్తితో ఇప్పటికే రిలేషన్ షిప్ ఉందని సన్నిహితులు పేర్కొంటున్నారు. మే 28న పౌరీలోని రిసార్ట్‌లో వివాహం జరగనుంది. బెనామ్ పూరీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆయన 2007లో పౌరీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఈ పెళ్లికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి రాజకీయ నేతలకు ఆహ్వానం అందింది.

    -శెనార్తి