Bandla Ganesh- Junior NTR: ట్విట్టర్ లో ఈమధ్య బండ్ల గణేష్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. తనకి నచ్చినట్టు మాట్లాడుతూ తనని ఎవరో మోసం చేసినట్టు గా, ఇప్పుడు బుద్ధి వచ్చినట్టుగా ఇలా రోజు ట్వీట్స్ వేస్తూనే ఉన్నాడు.ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్స్ వేస్తున్నాడో అర్థం కావడం లేదు కానీ, నేడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మీద డైరెక్ట్ అట్టాక్ చేసాడు.
ఇక అసలు విషయానికి వస్తే #RRR వంటి సెన్సేషన్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో గత కొంతం కాలం క్రితమే ఒక సినిమా రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా, అతి త్వరలోనే రెండవ షెడ్యూల్ ని కూడా ప్రారంభించుకోబోతుంది.ఈ సినిమాకి టైటిల్ ‘దేవర’ అని ఫిక్స్ చేసారు. ఇక్కడే ప్రారంభం అయ్యింది అసలు గొడవ.
బండ్ల గణేష్ కొంత కాలం క్రితమే ఫిలిం ఛాంబర్ లో తానూ తదుపరి నిర్మించబోయే సినిమాకి ‘దేవర’ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించాడట.నేడు ఎన్టీఆర్ కొత్త సినిమాకి ఆ టైటిల్ ని చూసి బండ్ల గణేష్ రియాక్ట్ అవుతూ ‘ఇది నేను కొంత కాలం క్రితం ఫిలిం ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయించిన టైటిల్..నేను మర్చిపోయేసరికి దొబ్బేసారు’ అంటూ బండ్ల గణేష్ ఒక ట్వీట్ వేసాడు.దీనికి సంబంధించి ట్విట్టర్ లో ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తుంది.
పవన్ కళ్యాణ్ తో ఆయన భవిష్యత్తులో తియ్యబోయే సినిమా కోసం ‘దేవర’ అనే టైటిల్ ని రిజిస్టర్ చేసాడట.ఇప్పుడు ఆ టైటిల్ ని బండ్ల గణేష్ అనుమతి తన అనుమతి లేకుండా తీసేసుకున్నారు అంటూ గొడవ స్టార్ట్ చేసాడు.ఈ గొడవ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.
దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్ నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు 😡 https://t.co/Y4guc8Yl34
— BANDLA GANESH. (@ganeshbandla) May 19, 2023