కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ బాగానే పడిందిగా?

కరోనా మహమ్మరిని ప్రభుత్వం అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. వీటిని తిప్పికొట్టేక్రమంలో కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రతిపక్షాలు కరోనాపై అనవసర రాద్దాంతం చేస్తున్నాయని, తెలంగాణలో టెస్టులు ఎక్కువగా చేయనప్పటకీ రికవరీ ఎక్కువగా ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఇలాంటి సమయంలోనూ ప్రతిపక్షాలు విమర్శలుమాని సలహాలిస్తే స్వీకరిస్తామని చెప్పారు. ఇది రాజకీయాలకు తగిన సమయం కాదనే భావనను కేటీఆర్ […]

Written By: Neelambaram, Updated On : July 15, 2020 3:16 pm
Follow us on


కరోనా మహమ్మరిని ప్రభుత్వం అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. వీటిని తిప్పికొట్టేక్రమంలో కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రతిపక్షాలు కరోనాపై అనవసర రాద్దాంతం చేస్తున్నాయని, తెలంగాణలో టెస్టులు ఎక్కువగా చేయనప్పటకీ రికవరీ ఎక్కువగా ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఇలాంటి సమయంలోనూ ప్రతిపక్షాలు విమర్శలుమాని సలహాలిస్తే స్వీకరిస్తామని చెప్పారు. ఇది రాజకీయాలకు తగిన సమయం కాదనే భావనను కేటీఆర్ వ్యక్తం చేశారు.

అయితే కేటీఆర్ వ్యాఖ్యలేమోగానీ సీఎం కేసీఆర్ భారీ పంచులు పడుతున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత వెంకటస్వామి కౌంటరిచ్చారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ రోజైనా విపక్షాలను పిలిచి మాట్లడారా? అని ప్రశ్నించారు. ముందుగా విపక్షాలను కేసీఆర్ గుర్తించాలన్నారు. తెలంగాణలో నిజాం పాలనను తలపించేలా టీఆర్ఎస్ సర్కారు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రధాని మోదీ విపక్షాలతో మాట్లాడి ప్రణాళికతో ముందుకెళుతున్నారని గుర్తుచేశారు.

కేసీఆర్ ను వెంటాడుతున్న ఆ ‘అర్థరాత్రి’ భయం

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేయడం అవసరమా? అంటూ నిలదీశారు. హైదరాబాద్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో కేసీఆర్ ఫౌంహౌజ్ నుంచి పాలన సాగించడం ఏంటని ప్రశ్నించారు. కొద్దిరోజులుగా సీఎం కన్పించకుండా పోయారని ఎద్దేశా చేశారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే నాయకులను అరెస్టు చేస్తున్నారని, ఎంపీలపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్ పై వస్తున్న విమర్శలు తిప్పికొట్టేందుకు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీకే బూమరాంగ్ అవడం గమనార్హం.