బాబుకు సైతం ఆ నేతలు దొరకడం లేదుగా?
సభావేదిక సాక్షిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజక వర్గాలకు నేను పనులు చేయనని చెప్పి, ప్రజా స్వామ్యంలో ప్రజల తీర్పుకు ఎంత గౌరవం ఇస్తాడో నిరూపించాడు. అధికారంలో ఉండగా అరచేతిలో వైకుంఠం చూపించిన బాబు, ప్రతిపక్షంలోకి వచ్చాక కొత్త రాగం అందుకున్నారు. రాష్ట్రానికి ఎలాంటి విపత్తు దాపురించినా జగన్ ఫెయిల్ అయ్యాడని..’అదే నేనుంటేనా’ అంటున్నాడు. మీరు ఉన్నప్పుడు ఏమి చేయలేదనే కదా ప్రజలు మిమ్ముల్ని ప్రతిపక్షానికి పరిమితం చేసింది. అధికారంలో ఉన్న ఐదేళ్లలో అభివృద్ధి, సంక్షేమం చేసి ఉంటే…ప్రజలు మిమ్మల్ని 23సీట్లకు ఎందుకు పరిమితం చేస్తారు చెప్పండి.
టీడీపీ బలాన్ని దెబ్బకొడుతున్న జగన్.
నేతలు చెప్పే గొప్పలు విని ఓట్లు వేసే రోజులు పోయాయి. ఏదైనా చేతల్లో చూపిస్తేనే నెక్స్ట్ అధికారం లేదంటే…పీఠం దిగాల్సిందే. బాబుకు మాత్రం ఇంకా ఆ హిపోక్రసి వీడడం లేదు. ఇంకా తానే ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉన్నారు. కరోనా కట్టడిలో దేశం మొత్తం జగన్ భేష్ అంటుంది. విపరీతంగా విజృంభిస్తున్న కరోనా కట్టడి విషయంలో జగన్ చాలా వరకు విజయం సాధించారు. ఆర్ధికంగా పరిపుష్టంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలు చేతులెత్తేశాయి. జగన్ వేలల్లో కరోనా టెస్ట్ లు నిర్వహిస్తూ నియంత్రిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కరోనా చికిత్స తీసుకొని బయట పడిన వారికి రూ. 2000 ఆర్థిక సాయం చేస్తున్నారు. నేటి నుండి వైరస్ కారణంగా మరణించిన వారి అంత్యక్రియల కోసం రూ. 15000 అందించనున్నారు. మొబైల్ కరోనా టెస్టుల కోసం 50కి పైగా బస్సులను సిద్ధం చేశారు. కరోనా కట్టడిలో బాబు ఇంతకు మించి ఏమి చేయగలడో సెలవిస్తే…బాగుంటుంది.