జేసీ తండ్రి కొడుకుల బండారం బట్టబయలు?

ఇన్నాళ్లు అనంతపురం జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి అక్రమాలు చేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబు,లోకేష్, టీడీపీ నేతలు ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. కానీ ఇప్పుడు వారే స్వయంగా నేర అంగీకారపత్రం పోలీసులకు రాసిచ్చినట్టు తెలిసింది. దీంతో టీడీపీ శిబిరంలో పచ్చి వెలక్కాయ పడ్డ చందంగా మారింది. దీనిపై చంద్రబాబు అండ్ కో ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. జేసీ ట్రావెల్స్ బస్సుల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో బుక్కైన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆయన కుమారుడు […]

Written By: NARESH, Updated On : July 16, 2020 10:55 am
Follow us on


ఇన్నాళ్లు అనంతపురం జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి అక్రమాలు చేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబు,లోకేష్, టీడీపీ నేతలు ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. కానీ ఇప్పుడు వారే స్వయంగా నేర అంగీకారపత్రం పోలీసులకు రాసిచ్చినట్టు తెలిసింది. దీంతో టీడీపీ శిబిరంలో పచ్చి వెలక్కాయ పడ్డ చందంగా మారింది. దీనిపై చంద్రబాబు అండ్ కో ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.

జేసీ ట్రావెల్స్ బస్సుల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో బుక్కైన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలను జగన్ సర్కార్ అన్యాయంగా అరెస్ట్ చేసిందని చంద్రబాబు.. టీడీపీ అనుకూల మీడియా మొసలి కన్నీరు కారుస్తూ దుష్ర్పచారాన్ని చేసింది. మొదట్లో వీరిద్దరూ కూడా మాకేం తెలియదు.. మేం ఏం చేయలేదంటూ బుకాయించారు. కానీ తాజాగా విచారణలో మొత్తం నిజాలు కక్కేసారని తెలిసింది. దీంతో జేసీ ట్రావెల్స్ అక్రమాల గుట్టు బయటపడినట్టు సమాచారం.

ఆధ్యాత్మికత కోసం బాలయ్య కసరత్తులు !

సుప్రీం కోర్టు 2017 ఏప్రిల్ 1 నుంచి నిషేధించిన దాదాపు 154 బీఎస్-3 వాహనాలను నాగాలాండ్ లో స్క్రాప్ కింద కొని వాటిని బీఎస్-4 వాహనాలుగా మార్చి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు బీఎస్4గా పేర్కొంటూ నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందుకోసం పెద్ద ఎత్తున గోల్ మాల్ చేశారు. తెలంగాణ, ఏపీ సహా ఎన్ఓసీ దేశమంతా తీసుకొని తిప్పారు. కొన్నింటిని అమ్మేశారు కూడా.. వీటిపై ఫిర్యాదు రావడంతో విచారించిన ఏపీ పోలీసులు తీగ లాగితే జేసీ ట్రావెల్స్ డొంక కదిలింది.

టీడీపీ మరో స్కాం వెలుగులోకి.. మాజీ మంత్రి బుక్

తాజాగా పోలీసుల విచారణలో మొండికేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆయన కుమారుడు అసలు నిజాలను కక్కినట్టు తెలిసింది. ఇందులో నిజాలు ఒప్పుకున్నట్టు సమాచారం. స్క్రాప్ వాహనాల కింద రిజిస్ట్రేషన్ కోసం ప్రభాకర్ రెడ్డి మొదట చెన్నైకి చెందిన ముత్తుకుమార్ ను సంప్రదించాడు. అతడు నాగాలాండ్ ఆర్టీఏ బ్రోకర్ సంజయ్ ద్వారా ఈ బీఎస్3 వాహనాలను బీఎస్4 వాహనాలుగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారు. నాగాలాండ్ తీసుకెళ్లకుండానే మొత్తం 154 వాహనాలను రిజిస్ట్రేషన్ ను చేయించారు. ఇందుకోసం జేసీ ప్రభాకర్ రెడ్డి భారీగా డబ్బులను ముత్తుకుమార్, సంజయ్ లకు ముట్టజెప్పాడు.

ఈ తతంగం ముగిశాక జేసీ అనుచరుడు నాగేంద్ర.. నకిలీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేశారు. వీటితోనే ఎన్ఓసీ తీసుకున్నారు. ఫోర్జరీ పత్రాలతో తెలంగాణ, కర్ణాటకల్లో 8 వోల్వో బస్సులు.. లారీలు విక్రయించారు. ఇలా స్క్రాప్ కింద 154 వాహనాలు కొని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించినట్టు పోలీసుల ఎదుట నేర అంగీకారపత్రం రాసిచ్చినట్టు తెలిసింది.

దీంతో ఈ కుంభకోణంలో ఏ1గా జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి ఉమారెడ్డిని, ఏ2గా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏ3గా నాగేంద్ర, ఏ4గా బాబయ్య, ఏ5గా జేసీ దివాకర్ రెడ్డి సతీమణి విజయ, ఏ6గా జేసీ అస్మిత్ రెడ్డిపై అనంతపురం తాడిపత్రి పోలీస్ స్టేషన్లలో మొత్తం 27 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నేరం అంగీకరించడంతో జేసీ ఫ్యామిలీ మొత్తం జైలు పాలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.