Tula Uma : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 40 టికెట్లు ఇచ్చిన పార్టీ బీజేపీ.. ప్రజలు గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన పార్టీ బీజేపీ.. మహిళలకు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించిన పార్టీ బీజేపీ.. ఇలా తాము చేసిన పనులు, ఇచ్చిన హామీల గురించి బీజేపీ నాయకులు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ, నామినేషన్ల చివరి రోజు ఓ మహాళా నాయకురాలు, బీసీ ఉద్యమకారణికి బీజేపీ షాక్ ఇవ్వడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వేములవాడ అభ్యర్థి విషయంలో బీజేపీ అధిష్టానం యూటర్న్ తీసుకుని తులా ఉమకు బదులు వికాస్ రావుకు బీఫాం ఇచ్చింది. దొరలకు వ్యతిరేకంగా పోరాడినందుకే బీసీ నాయకురాలు అయిన తనకు టికెట్ ఇస్తామని ప్రకటించి బీఫాం ఇవ్వం కుడా అవమానించారని కరీంనగర్ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ్మ ఆరోపించారు. తనకు ఇవ్వాల్సిన బీఫాంను మరో దొరకే ఇచ్చారని తెలిపారు.
BJP లో బీసీలకు ప్రాధాన్యత లేదు : తుల ఉమ #tulauma
..
ఉద్యమకారిణి తుల ఉమ గారికి నమ్మించి గొంతు గోసిన బీజేపీ. pic.twitter.com/nVMPsILmVH— Prabhakar Venavanka (@Prabhavenavanka) November 10, 2023
టికెట్ ఇచ్చి.. బీఫాం ఇవ్వకుండా..
తెలంగాణలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితాలో తుల ఉమకు వేములవాడ టికెట్ కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు జాబితా కూడా విడుదల చేసింది. దీంతో తుల ఉమ నామినేషన్ వేసేందుకు శుక్రవారం ఏర్పాటు చేసుకున్నారు. భారీ ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు. కాసేపటికే బీజేపీ తరఫున చెన్నమనేని వికాస్‌రావు తరఫున పార్టీ నాయకులు కూడా నామినేషన్ వేశారు. దీంతో టికెట్ ఎవరికి అన్న ఉత్కంఠ నెలకొంది. కానీ, ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ అధిష్టానం వికాస్‌రావుకు బీఫాం ఇచ్చింది. చివరి నిమిషంలో బీజేపీ షాక్ ఇవ్వంతో తుల ఉమకన్నీటిపర్యంతమయ్యారు.
బీజేపీ 3వ లిస్ట్ లో వేములవాడ సీటు తుల ఉమకే ప్రకటించి మరీ బీఫాం ఇవ్వలేదు
కారణం ఇదేనట..
తుల ఉమకు బీఫాం ఇవ్వకపోవడానికి బీజేపీ కూడా కారణం చెబుతోంది. స్థానిక నాయకత్వం అంతా కూడా మూడు రోజులుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరసనలు తెలపడంతో తుల అభ్యర్థిత్వాన్ని కాదని వికాస్ రావుకే టికెట్ ఇచ్చారు. గతంలో జనశక్తి పార్టీలో పనిచేసిన తుల ఉమ బీజేపీ నేతలను టార్గెట్ చేసిన అంశాన్ని వేములవాడ బీజేపీ శ్రేణులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. మేడిపల్లి మండలానికి చెందిన పార్టీ అధ్యక్షుడు గోరె బాబు మియాతోపాటు ఇద్దరు సర్పంచులను జనశక్తి హత్య చేయడంతోపాటు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రతాప రామకృష్ణపై కూడా దాడి చేసిన విషయాన్ని రాష్ట్ర నాయకత్వానికి వివరించారు. విద్యాసాగర్ రావు బీజేపీతోనే అనుబంధం పెనవేసుకుని ముందుకు సాగుతున్నారని, ఆయన తనయుడు అయిన వికాస్ రావుకు టికెట్ ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పునరాలోచనలో పడి చివరకు కాస్‌రావు అభ్యర్థిత్వానికే మొగ్గు చూపింది.
నిబంధనలు కాదని..
వాస్తవంగా తెలంగాణలో వారసులకు టికెట్ ఇవ్వకూడదన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన పార్టీ నేతలు ఆ దిశగానే ముందుకు సాగించే విధంగా పావులు కదిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం వారసత్వ రాజకీయాలపై విమర్శలు చేస్తున్నందున బీజేపీలో వారసులకు అవకాశం ఇవ్వకూడదన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చి సక్సెస్ అయ్యామని బీజేపీలోని ఓ వర్గం నాయకులు భావించారు. కానీ అనూహ్యంగా వేములవాడ పార్టీ శ్రేణులు పట్టుబట్టి తుల ఉమపై ఫిర్యాదుల పరంపర కొనసాగించడంతోపాటు జనశక్తి విప్లవ పార్టీలో పనిచేసిన ఆమె వల్ల పార్టీ శ్రేణులు ఒకప్పుడు తీవ్రమైన కష్టాలను చూశారన్న విషయాన్ని బలంగా వినిపించాయి. దీంతో వికాస్ రావుకు టికెట్ దక్కింది.