Liquor lorry : మద్యం లారీ బోల్తా.. మందుబాబులకు పండగే

అయితే ఈ విషయం దావనంలా వ్యాపించడంతో నగరం నలుమూలల నుంచి జనాలు రావడం కనిపించింది. అప్పటికే పోలీసులు మోహరించడంతో.. వారంతా నిరాశతో వెనుదిరిగారు.

Written By: NARESH, Updated On : November 11, 2023 9:24 pm
Follow us on

Liquor lorry : రహదారిపై వెళ్తున్న ఓ లారీ బోల్తా పడింది. అందులో ఉన్న మద్యం బాటిళ్లు రోడ్డుపై పడ్డాయి. ఇంకేముంది పక్కనే వెళ్తున్న వాహనదారులు, స్థానికులు ఎగబడ్డారు. అందినోళ్లకు అందినంతగా బాటిళ్ల ను తీసుకొని పరారయ్యారు. ముందుగానే దీపావళి పండుగ చేసుకున్నారు. విశాఖ నగరంలోని మధురవాడ లో వెలుగు చూసింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖ జిల్లా మధురవాడలో మద్యం బాటిళ్ల లోడుతో వెళ్తున్న లారీ నడిరోడ్డుపై బోల్తా పడింది. దీంతో కొన్ని బాటిళ్లు రోడ్డుపై పడి పగిలిపోయాయి. మరికొన్ని కాటన్లలో మద్యం బాటిళ్లను తీసుకెళ్లడానికి వాహనదారులు, స్థానికులు ఎగబడ్డారు. అందిన కాడికి మద్యం పార్టీలను తీసుకెళ్లారు. వారిని నిలువరించేందుకు డ్రైవర్ విఫలయత్నం చేశాడు. అయినా ఫలితం లేకపోయింది. సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి వాహనానికి రక్షణ కల్పించారు. సమాచారం అందడంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి వచ్చి చేరుకున్నారు. స్థానికులను చెదరగొట్టి మందు బాటిళ్లను దొంగిలించకుండా చర్యలు చేపట్టారు.

మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగింది. అనంతపురం నుంచి విశాఖ వైపు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మితిమీరిన వేగం, సామర్థ్యానికి మించి భారం వేయడం ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. రోడ్డుకు అడ్డంగా పడిన వాహనాన్ని భారీ క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించారు. రాకపోకలను పునరుద్ధరించారు. కాగా మద్యం బాటిళ్లు పెద్ద ఎత్తున దొరకడంతో మందుబాబులు సందడి చేసుకున్నారు. తమకు దీపావళి ముందుగానే వచ్చిందంటూ తెగ హడావిడి చేశారు. కొందరైతే జేబుల్లో.. మరికొందరైతే సంచుల్లో మద్యం సీసాలను వేసుకోవడం కనిపించింది. వద్దని డ్రైవర్ వారిస్తున్నా.. ఎవరూ వినలేదు. అయితే ఈ విషయం దావనంలా వ్యాపించడంతో నగరం నలుమూలల నుంచి జనాలు రావడం కనిపించింది. అప్పటికే పోలీసులు మోహరించడంతో.. వారంతా నిరాశతో వెనుదిరిగారు.