Konda Vishweshwar Reddy- RK: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని బీరాలు పలికినా చివరకు ఏమైంది? ఎవరు కూడా మద్దతు తెలపడం లేదు. అందుకే కేసీఆర్ వన్ని పిట్టల దొర మాటలే అని తెలుస్తోంది. ఓటర్లను పక్కదారి పట్టించడం కొత్తేమీ కాదు. గతంలో కూడా పలుమార్లు ఇలా ఏవో కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలం గడుపుతున్నట్లు చెబుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ పై వ్యతిరేకత హద్దులు దాటుతోంది. ఇదివరకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు. దీంతో కేసీఆర్ తీరుకు విసుగు చెందిన చాలా మంది పార్టీని వీడారు.
ఈక్రమంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. దీంతో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ విశ్వేశ్వర్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసి పలు ప్రశ్నలు అడిగారు. దీనికి ఆయన సమాధానాలు చెప్పారు. తాను పార్టీ మారలేదని టీఆర్ఎస్ మారిపోవడంతోనే తాను బీజేపీలో చేరాల్సి వచ్చిందని చెప్పారు. కేసీఆర్ విధానాలతో అందరు విభేదిస్తున్నా ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇంకా చాలా మంది పార్టీని వీడే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
Also Read: BJP- TDP: టీడీపీకి బీజేపీ స్నేహ హస్తం.. కేసీఆర్, జగన్ చర్యలే కారణం?
రాష్ట్రంలో కుటుంబపాలన, నియంతృత్వ ధోరణితో ప్రజలు కూడా సతమతమవుతున్నారు. ప్రస్తుతం పీకే వచ్చినా ఏకే వచ్చినా టీఆర్ఎస్ ఓటమి తథ్యమే. ఓటర్లలో కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. కేటీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే వ్యతిరేకత తగ్గే అవకాశమున్నా కేసీఆర్ కేటీఆర్ కు అవకాశం ఇస్తారో లేదో తెలియడం లేదు. ఈ సందర్భంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదగడం ఖాయమే అని తెలుస్తోంది. కాంగ్రెస్ పోరాటం చేస్తున్నా నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంలో పడుతోంది.
రాష్ట్రంలో బీజేపీ బలంగా విస్తరిస్తోంది. రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీయే అని తెలుస్తోంది. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి టీఆర్ఎస్ ప్రజల్లో చులకన అయిపోతోంది. ఇంటికో ఉద్యోగం, దళితుడికి సీఎం పదవి, ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి ఎన్నో హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇంకా అవి నేను అనలేదని తప్పించుకోవడం తెలిసిందే. దీంతోనే ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణను అధోగతి పాలు చేసింది కేసీఆర్ అని చెబుతున్నారు.
ఎన్ని సర్వేలు చేసినా టీఆర్ఎస్ తల రాత మారడం కలే. మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలని కలలు కంటున్నా అవి నెరవేరేలా లేవు. దీంతో కేసీఆర్ లో స్థిమితం కనిపించడం లేదు. అందుకే మాటల్లో తేడా వస్తోంది. విమర్శల జోరు పెరుగుతోంది. ఎవరి మీదనైనా డైరెక్టుగా విమర్శలు చేస్తున్నారు. దీంతో ఎదుటి వారి స్థాయి కూడా ఆలోచించడం లేదు. ప్రధాని పై విమర్శలు చేసే స్థాయి కేసీఆర్ ది కాదు. కానీ ప్రధాని మోడీని తెగ తిడుతూ విమర్శలు చేస్తూ ఏదో సాధించానని అనుకుంటున్నా అదంతా వ్యతిరేకత కిందకే వస్తుందని తెలియడం లేదు. కానీ కేసీఆర్ కాలం దగ్గర పడిందనే వాదనలు కూడా వస్తున్నాయి.
రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ బంగాళాఖాతంలో కలవడం ఖాయం. ఎన్ని వ్యూహాలు పన్నినా చివరకు గెలిచేది బీజేపీయే. దక్షిణాదిలో పట్టు కోసం బీజేపీ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటకలో అధికారం హస్తగతం చేసుకున్నా తెలంగాణలో కూడా తన సత్తా చాటాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది.
Also Read:CM Jagan: మూడేళ్లకు తత్వం బోధపడిందా?.. గట్టి హెచ్చరికలతోనే జగన్ జనం బాట