అడ్డంగా దొరికిన బీజేపీ నేత.. షాక్ లో ముఖ్య నేతలు

ఏపీ బీజేపీ సీనియర్ నేత ఒక్కరు ఓ భారీ స్కాంలో అడ్డంగా బుక్కయ్యారు. ఈ భారీ చీకటి ఒప్పందానికి సంబంధించిన కీలక అంశాలను ఓ మీడియా సంస్థ బట్టబయలు చేసింది.అవినీతి మచ్చలేకుండా సాగే బీజేపీ నేతలకు భిన్నగా ఏపీ బీజేపీ లీడరు వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు బీజేపీ నేతలు రాయలసీమలో నడిచే ఒక ప్రముఖ ఆశ్రమం చేసిన రూ.400 కోట్ల ఆర్థిక అవకతవకల నుంచి బయటపడేందుకు సాయం […]

Written By: Srinivas, Updated On : March 1, 2021 1:33 pm
Follow us on


ఏపీ బీజేపీ సీనియర్ నేత ఒక్కరు ఓ భారీ స్కాంలో అడ్డంగా బుక్కయ్యారు. ఈ భారీ చీకటి ఒప్పందానికి సంబంధించిన కీలక అంశాలను ఓ మీడియా సంస్థ బట్టబయలు చేసింది.అవినీతి మచ్చలేకుండా సాగే బీజేపీ నేతలకు భిన్నగా ఏపీ బీజేపీ లీడరు వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు బీజేపీ నేతలు రాయలసీమలో నడిచే ఒక ప్రముఖ ఆశ్రమం చేసిన రూ.400 కోట్ల ఆర్థిక అవకతవకల నుంచి బయటపడేందుకు సాయం చేసినట్లు తెలిసింది. ఇందుకు రూ.30 కోట్లు తీసుకున్నట్లు ఓ మీడియా సంస్థ ఆరోపించింది.

Also Read: ఉద్యమ నాయకుడు.. ఇబ్బందిగా మారుతున్నాడా..?

రాయలసీమలోని ఒక ఆశ్రమంలో భారీగా అక్రమ సొమ్ము ఉంది. దాని విలువ రూ.400కోట్లు. దీని గురించి సమాచారం తెలుసుకున్న ఈడీ.. ఐటీ విభాగాలు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచాయి. ఈ కేసును బయటపడేందుకు ఆశ్రమ నిర్వాహకులు సీమకు చెందిన ఒక బీజేపీ నేతను ఆశ్రయించగా.. ఆయన డీల్ సెటిల్ చేస్తానని కమిట్మెంట్ ఇచ్చాడు. ఒకప్పుడు పార్టీ ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేసిన ఆ వ్యక్తి మాటలు చెప్పడంతో పాటు అధికారంలో ఉన్న నేతలను బుట్టలో వేసుకుని కోట్లు గడించారని పేరుంది.

గత ప్రభుత్వంలో తన సామాజిక వర్గానికి చెందిన ఓ మంత్రితో భారీగానే లావాదేవీలు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా తన సామాజిక వర్గానికే చెందిన కేబినెట్ ర్యాంకు నేతతో బెంగళూరులో భారీగా పైరవీలు చేశారన్న మాటా ఉంది. తను మంత్రి హోదా పదవి ఉందని.. తాను చెబితే ఢిల్లీ నుంచి సదరు కేసు దర్యాప్తు అధికారులు ఇక్కడకు వస్తారని.. చెప్పాడు.దీంతో ఆ నాయకుడి మాటలకు ఓకే చెప్పిన ఆశ్రమ పెద్దమనిషి రూ.30కోట్లు ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నాడు.

Also Read: సమయం లేదు.. ఇక తాడో పేడో.. అమిత్ షాతో భేటీ కానున్న జనసేన అధినేత పవన్

డీల్ లో భాగంగా రాయలసీమ నేతకు రూ.3కోట్లు.. ఢిల్లీ నుంచి కేంద్ర సంస్థల అధికారిని రప్పించి మరో నేతకు రూ.7 కోట్లు ఇచ్చాడు. మిగిలిన రూ.20 కోట్లు ఢిల్లీ అధికారికి ఇవ్వాల్సి ఉందని చెప్పి తీసుకున్నాడు. ఇలా చేతులు మారిన రూ.30 కోట్లకు చెందిన వివరాలు కేంద్రం సేకరించినట్లు తెలిసింది. ఈ విషయంలో అధిష్టానం సీరియస్ అయ్యింది. మరో నాలుగు రోజుల్లో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు కీలకంగా మారింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్