2014 ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి కేంద్రంలో మోదీ హవా నడుస్తోంది. మోదీ తీసుకున్న నోట్లరద్దు, జీఎస్టీ, ఆర్టికల్ 370 రద్దు, చైనా యాప్స్ పై నిషేధం లాంటి నిర్ణయాలు మోదీ పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి. మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యల వల్లే దేశంలో కరోనా మరణాలు తక్కువగా నమోదవుతున్నాయని… ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదైనా సకాలంలో చికిత్స అందేలా మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యలు హర్షణీయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
Also Read : ఏపీ పరువును గంగలో కలుపుతున్న టీడీపీ వైసీపీ నేతలు?
కేంద్రంలో మోదీ హవా నడుస్తుండటంతో రాష్ట్రంలో బీజేపీ హవా పెరుగుతోంది. కొన్ని నెలల క్రితం బీజేపీ జనసేన పార్టీలు కలిసి భవిషత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పడం ఇరు పార్టీలకు ప్లస్ అయింది. బీజేపీతో పొత్తు తర్వాత జనసైనికుల్లోనూ ఉత్సాహం పెరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ, జనసేన వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఏపీలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల టీడీపీ బలం తగ్గుతోందని… భవిష్యత్తులో టీడీపీ పుంజుకోవడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించడంలో బీజేపీ జనసేన కూటమి సఫలమవుతోంది. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం తీరుకు నిరనగా ఆందోళనలు చేపడుతూ రాష్ట్రంలో బలపడుతోంది.
మరోవైపు ఏపీలో వైసీపీ పాలన పట్ల ప్రజల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని విషయాల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు ఏ మాత్రం నచ్చడం లేదు. టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేకపోవడం, వైసీపీకి ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతుండటంతో 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీ జనసేన కూటమి మరింత బలపడి ఏపీలో అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు తెలుపుతున్నారు.
Also Read : టిక్ టాక్ కు ఊరట.. నిషేధం ఎత్తేసిన ట్రంప్