city bus
లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లో దాదాపు ఆరు నెలల పాటు నిలిచిపోయిన సిటీబస్సులు పున:ప్రారంభానికి అవకాశాలు కన్పిస్తున్నాయి. దేశంలోని కొన్ని మెట్రోసిటీల్లో జాగ్రత్తలతో సిటీ బస్సులను నడిపిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో కూడా సిటీ బస్సులను నడిపించాలని ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ సడలింపుల్లో ఇప్పటికే ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నా సిటీ బస్సులను ప్రారంభించలేదు. కోవిడ్ ఉధృతి తగ్గకున్నా నగరవాసుల ఇబ్బందులను గుర్తిందచి తగిన జాగ్రత్తలతో బస్సులను నడిపించనున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఆదేశాలు వెళ్లినా తేదీలు మాత్రం ఖరారు కాలేదు.