https://oktelugu.com/

జగన్ అస్త్రాన్నే ప్రయోగిస్తున్న బీజేపీ-పవన్

పాదయాత్ర.. తెలుగునేలపై పవర్ ఫుల్ యాత్ర. రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసే యాత్ర. అందుకే ఈ పాదయాత్ర చేసిన నాయకులను ప్రజలు అందలమెక్కించారు. ఆ తదనంతర కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రులను చేశారు..  వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్ జగన్.. అంతా ఒకేబాటలో నడిచారు. అనంతరం అధికారాన్ని అధిరోహించారు.ఇప్పుడు జగన్ పాదయాత్రతో కొల్లగొట్టిన అధికారాన్ని అదే అస్త్రంతో చేజిక్కించుకోవాలని కేంద్రంలోని బీజేపీ, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాన్ డిసైడ్ అయ్యారని సమాచారం. […]

Written By:
  • NARESH
  • , Updated On : July 5, 2020 / 05:21 PM IST
    Follow us on

    పాదయాత్ర.. తెలుగునేలపై పవర్ ఫుల్ యాత్ర. రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసే యాత్ర. అందుకే ఈ పాదయాత్ర చేసిన నాయకులను ప్రజలు అందలమెక్కించారు. ఆ తదనంతర కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రులను చేశారు..  వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్ జగన్.. అంతా ఒకేబాటలో నడిచారు. అనంతరం అధికారాన్ని అధిరోహించారు.ఇప్పుడు జగన్ పాదయాత్రతో కొల్లగొట్టిన అధికారాన్ని అదే అస్త్రంతో చేజిక్కించుకోవాలని కేంద్రంలోని బీజేపీ, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాన్ డిసైడ్ అయ్యారని సమాచారం. ఈ మేరకు ఏపీ రాజకీయాలను షేక్ చేసే ప్లాన్ తో రెడీ అవుతున్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.టీడీపీ కుదేలైంది. వైసీపీ కొట్టిన దెబ్బకు కోలుకోవడం లేదు. మరోవైపు ప్రత్యర్థులంతా కాచుకు కూర్చున్నారు. బీజేపీ అయితే చంద్రబాబును నిర్వీర్యం చేసి టీడీపీని హైజాక్ చేయాలని చూస్తోంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలను లాగేసింది. పార్టీ మారిన వారంతా టీడీపీ పుట్టి మునగడానికి లోకేష్ కారణమంటున్నారు.  లోకేష్ పై నమ్మకం లేదని.. జూనియర్ ఎన్టీఆర్ రావాలని కొందరంటున్నారు. ఇక టీడీపీ గడ్డు పరిస్థితుల్లో ఉందని.. బాలక్రిష్ణ సినిమాలు వదిలి ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రావాలని తెలుగుతమ్ముళ్లు కొంతమంది కోరుతున్నారు.

    ఏపీ రాజకీయాల్లో ఉన్న అనిశ్చితిని క్యాష్ చేసుకోవాలని కేంద్రంలోని బీజేపీ.. జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి ఓ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతున్నట్టు సమాచారం. 2014లో పార్టీ స్థాపించినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో బలంగా లేని జనసేనాని బీజేపీతో పొత్తుతో ఆలోటును భర్తీ చేసుకోవాలనుకుంటున్నాడు.

    జనసేన ఒంటరిగా గెలవడం జనసేనాని పవన్ తో సాధ్యం కాదని తేలిపోయింది. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం.. వాటి నుంచి దూరంగా వెళ్లడం జనసేనకు అలవాటైపోయింది. పవన్ పార్టీ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది.

    అయితే ఏపీలో అధికారాన్ని సాధించడానికి పవర్ ఫుల్ మంత్రాన్ని బీజేపీ తెరపైకి తెస్తోందని సమాచారం. కేంద్రంలో బీజేపీ అండ ఉండడంతో చెలరేగిపోవడానికి పవన్ కూడా రెడీ అవుతున్నాడట.. పవన్ ను ముందు పెట్టి ఆయన ఇమేజ్ తో రాజకీయం నడపడానికి బీజేపీ రెడీ కాబోతోందట..

    తెలుగునాట చరిత్ర చూస్తే.. పాదయాత్ర చేసిన ఏ నాయకుడైనా కానీ అధికారంలోకి రాకమానలేదు. ప్రజల్లోకి వెళ్లి నిజాయితీగా కలిసిపోయి వారి కష్టాలు తెలుసుకున్న నాయకులు వారి విశ్వాసాన్ని పొంది రాజకీయ అధికారం సాధించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను కూడా బీజేపీ ప్రజల్లోకి పంపబోతోంది.

    2022 నుంచి పాదయాత్రను పవన్ కళ్యాణ్ ప్రారంభించి, 2024 ఎన్నికల వరకు కొనసాగించేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ ఎలాగూ 15రోజులు, నెలకోసారి విరామం ఇస్తూనే ఉంటారు. అందుకే రెండేళ్లు కాలపరిమితిని పెట్టినట్టు తెలుస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు చేరువ కావడం.. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతమే లక్ష్యంగా పవన్-బీజేపీ ఈ ప్లాన్ చేసినట్టు సమాచారం. మరి ఈ పవర్ ఫుల్ పాదయాత్ర పవన్ కళ్యాణ్ ను అధికారంలోకి తెస్తుందా? బీజేపీ ఆశలు ఫలిస్తాయా? అన్నది వేచిచూడాలి.

    -ఎన్నం