కాంగ్రెస్‌ చేస్తే తప్పు.. బీజేపీ చేస్తే కరెక్టా..: ధరల పెంపుపై ఇదేం వైఖరి

60 యేళ్ల పాల‌న‌, 60 యేళ్ల పాల‌న అంటూ.. కాంగ్రెస్‌ను తిట్టితిట్టీ మరీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఒక్క సారి కాదు.. ఏకంగా రెండోసారి కూడా కేంద్రంలో పగ్గాలు చేపట్టింది. అయితే.. గ‌త కొన్నాళ్లుగా బీజేపీ తీరును గ‌మ‌నిస్తే మ‌ళ్లీ కాంగ్రెస్‌ చేసిన తప్పులే చేస్తున్నట్లు అర్థమవుతోంది. వివిధ రాష్ట్రాల్లో అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా బీజేపీ చేస్తున్న రాజ‌కీయాలు కాంగ్రెస్ కాలాన్నే గుర్తు చేస్తోంది. త‌మ‌కు మెజారిటీ ఉన్నా లేక‌పోయినా ఎలాగోలా బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాల‌ను ఏర్పాటు […]

Written By: Srinivas, Updated On : March 7, 2021 3:35 pm
Follow us on


60 యేళ్ల పాల‌న‌, 60 యేళ్ల పాల‌న అంటూ.. కాంగ్రెస్‌ను తిట్టితిట్టీ మరీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఒక్క సారి కాదు.. ఏకంగా రెండోసారి కూడా కేంద్రంలో పగ్గాలు చేపట్టింది. అయితే.. గ‌త కొన్నాళ్లుగా బీజేపీ తీరును గ‌మ‌నిస్తే మ‌ళ్లీ కాంగ్రెస్‌ చేసిన తప్పులే చేస్తున్నట్లు అర్థమవుతోంది. వివిధ రాష్ట్రాల్లో అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా బీజేపీ చేస్తున్న రాజ‌కీయాలు కాంగ్రెస్ కాలాన్నే గుర్తు చేస్తోంది. త‌మ‌కు మెజారిటీ ఉన్నా లేక‌పోయినా ఎలాగోలా బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాల‌ను ఏర్పాటు చేయ‌గలిగింది. ఈ క్రమంలో అవ‌స‌రాన్ని బ‌ట్టి త‌ను అనుస‌రిస్తున్న విధానాల‌ను బీజేపీనే తుంగ‌లోకి తొక్కుకొంటూ ఉండ‌టం గ‌మ‌నార్హం.

Also Read: బెంగాల్‌లో మమతా బెనర్జీ బీజేపీని ఢీకొట్టే ప్లాన్ ఇదే..

క‌ర్ణాట‌క‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలోని ఒక ముఖ్యనేత అక్కడ సెక్స్ స్కాండ‌ల్‌లో చిక్కుకున్నారు. ఇది బీజేపీ నైతిక‌త‌కు ప్రశ్నగా మారింది. మ‌రోవైపు గ‌తంలో పెట్రో ధ‌ర‌ల పెంపు విష‌యంలో బీజేపీ వాళ్లు అనేక సార్లు యూపీఏ ప్రభుత్వాన్ని విమ‌ర్శించారు. నాడు గుజ‌రాత్ ముఖ్యమంత్రి హోదాలో న‌రేంద్రమోడీ పెట్రోల్ ధ‌ర‌ల పెంపు కేంద్ర ప్రభుత్వ వైఫ‌ల్యమే అంటూ ట్వీట్లు కూడా చేసేవారు. ఇప్పుడు ఆయ‌నే ప్రధానిగా ఉన్నప్పుడు పెట్రో ధ‌ర‌లకు హ‌ద్దు లేకుండా పోయింది. కొత్త రికార్డుల‌కు చేరుతున్నాయి.

Also Read: ఆ సీడీలను ప్రసారం చేయొద్దు.. రాసలీలల సీడీలపై కోర్టుకెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలు

ఇక అప్పట్లో పెట్రో ధ‌ర‌ల పెంపునకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కార‌ణ‌మంటూ విమ‌ర్శించిన బీజేపీ నేత నిర్మలా సీతారామ‌న్, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ఉన్నారు. ఆమె మాట్లాడుతూ.. పెట్రో ధ‌ర‌ల‌ను నిర్ణయించేది ఆయిల్ కంపెనీలు అంటున్నారు. ఇందుకు సంబంధించి గ‌తంలో ఈమె ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు అనే వీడియో వైర‌ల్‌గా మారింది సోష‌ల్ మీడియాలో. మాట‌లతో ప‌బ్బం గ‌డుపుకునే రోజులు బీజేపీకి పూర్తయిన‌ట్టుగా ఉన్నాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

రెండోసారి నెగ్గాకా పెట్రో ధ‌ర‌ల పెంపుతో స‌ర్వ నిత్యావ‌స‌రాల ధ‌ర‌లూ పెరుగుతున్నాయి. ర‌వాణా చార్జీలు పెర‌గ‌డంతో పాటు పాలు కూర‌గాయ‌ల ధ‌ర‌లు కూడా పెరుగుతున్నాయి. ఏసీ రూముల్లో కూర్చుని ప‌ని చేసుకుంటూ, ఆరంకెల శాల‌రీలు తీసుకునే వారికి ఈ నొప్పి తెలియ‌క‌పోవ‌చ్చు కానీ.. దేశంలో ఇంకా పేద‌లున్నారు, మ‌ధ్యత‌ర‌గ‌తి వారు కూడా ఉన్నారు. వారు ఈ ధ‌ర‌ల పెంపును త‌ట్టుకోలేని ప‌రిస్థితుల్లో ఉన్నారు. అందుకే.. ఇప్పుడు మోడీ ప్రభుత్వం సర్వత్రా వ్యతిరేకత మొదలైనట్లుగా అర్థమవుతోంది. ఇప్పటికైనా కేంద్రం స్పందించి పేదల బాగోగులు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు.