అన్నింటా మొండిగా వ్యవహరించే తెలంగాణ సీఎం కేసీఆర్ తన పంథాని మార్చుకుంటున్నారు. ఎవరి మాట వినని ముఖ్యమంత్రి ఏపీ సీఎం జగన్ బాటలో పయనించాలని అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ర్టంలో సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసి.. ప్రజల్లో తిరిగి నాటి విశ్వాసం పొందాలని అనుకుంటున్నారు. ఈ ఏడాది పూర్తిస్థాయిలో సంక్షేమ బడ్జెట్ ప్రవేశపెట్టి.. ఓ క్యాలెండర్ ప్రకారం.. ఖచ్చింతంగా అనుకున్న తేదీకి లబ్దిదారులకు నగదు అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నారు.
Also Read: తెలంగాణలోని ఆ ప్రాంతంలో పందుల పోటీలు.. ఫ్రైజ్ మనీ ఎంతంటే..?
బడ్జెట్ కసరత్తులో సీఎం కేసీఆర్ తన అభిప్రాయాన్ని ఇదివరకే అధికారులకు స్పష్టంగా చెప్పేశారు. బడ్జెట్ పై అధికారులు రూపొందించి ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అధికారులు అందించారు. ప్రగతిభవన్లో ఈ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 2020 .. 21 ఆర్థిక సంవత్సరానికి గానూ. 1.82 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. కరోనా .. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఆశించిన స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం రాలేదు.
Also Read: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్ షెడ్యూల్ విడుదల..!
అయితే కేసీఆర్ మాత్రం.. ఈ సారి బడ్జెట్ పెరగాలని సూచించారు. పూర్తిస్థాయిలో సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని అనుకున్నారు. అమలు చేయాల్సిన పథకాలతో పాటు కొత్త పథకాలకు కావల్సిన నిధులపై కూడా అధికారులతో చర్చించారు. రుణమాఫీ.. రైతుబంధు.. నిరుద్యోగ భృతి.. వంటివాటికి ఈసారి నిధులు కేటాయింపు ఉండనుంది. సీఎం పరిశీలన తరువాత బడ్జెట్ పద్దుల ప్రతిపాదనలపై తుది కసరత్తు ఉంటుంది. అనంతరం శాఖవారీగా.. పూర్తిస్థాయిలో నిధుల కేటాయింపు ఉంటుంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
ఈనెల 15 తరువాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ సమావేశాలను దాదాపు నెలరోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఇటీవలికాలంలో టీఆర్ఎస్ సర్కారుపై ప్రజల్లో మోజు తగ్గిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం.. ఇచ్చే పథకాలు సమయానికి అనుగుణంగా అందకపోవడంతో లబ్దిదారుల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. పెన్షన్లు.. రేషన్ కార్డుల మంజూరీ ఎప్పుడో నిలిపివేశారు. వీటన్నింటికీ బడ్జెట్లో పరిష్కారం చూపి.. ఈసారి సంక్షేమ బడ్జెట్ రూపొందించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో బడ్జెట్ కు ఓ రూపం ఇచ్చే అవకాశం ఉంది.