Siddu Jonnalagadda DJ Tillu Sequel: 2022 లో డీజే టిల్లు ఓ సంచలనం. సస్పెన్స్, రొమాన్స్, కామెడీ, క్రైమ్ కలగలిపి ప్రయోగాత్మకంగా తెరకెక్కింది. యూత్ కి తెగ నచ్చేసిన ఈ మూవీ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. వరల్డ్ వైడ్ డీజే టిల్లు రూ. 17 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. సినిమా బడ్జెట్ రీత్యా డబుల్ బ్లాక్ బస్టర్ అందుకుంది. దాదాపు ఒక రాత్రి జరిగే కథగా చక్కని స్క్రీన్ ప్లేతో తక్కువ ఖర్చుతో డీజే టిల్లు తెరకెక్కించారు. సాంగ్స్ కూడా సినిమాకు కలిసొచ్చాయి. ”డీజే టిల్లు పేరు వీడి స్టైలే వేరు” సాంగ్ అయితే రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేసింది.
ఈవెంట్స్, ఫంక్షన్స్ లో డీజే టిల్లు పాట పడాల్సిందే అన్నట్లుంది. ఆ మూవీ విడుదలై చాలా కాలం అవుతున్నా పాట జోరు తగ్గలేదు. ఇక టిల్లు మూవీ విజయంలో హీరో సిద్దూ జొన్నలగడ్డ కీలకం. డీజే టిల్లు ఆయన నటన చాలా సహజంగా ఉంటుంది. తెలంగాణా యాసలో కామెడీ పంచ్లు, మాస్ బాడీ లాంగ్వేజ్ తో ఇరగదీశాడు. సిద్దూ యాక్టింగ్ ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు. కాగా డీజే సక్సెస్ నేపథ్యంలో దీనికి సీక్వెల్ సిద్ధం చేస్తున్నారట.
Also Read: Malaika Arora: బ్రాలో పబ్లిక్ గా తిరిగేస్తున్న ముదురు భామ మలైకా… అందాల దాడికి కుర్రాళ్లు పరేషాన్!
డీజే టిల్లు చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఆయన సిద్ధూ తో డీజే టిల్లు 2 తెరకెక్కిచాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా… త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్రణాళికలు వేస్తున్నారు. మొదటి పార్ట్ లాగే కామెడీ యాంగిల్ ఎక్కడా తగ్గకుండా మరింత ఎంటర్టైనింగ్ గా డీజే టిల్లు 2 సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరి హీరోయిన్ గా నేహా శెట్టినే తీసుకుంటారా? లేక మార్చుతారా? అనేది చూడాలి. రాధికా పాత్రలో నేహా శెట్టి డీజే టిల్లు మూవీలో కేక పుట్టించారు. ఆమె పాత్రలోని షేడ్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. డీజే టిల్లు మూవీలో బ్రహ్మాజీ, ప్రగతి, ప్రిన్స్, రాజా రవీంద్ర, కిరీటి దామరాజు కీలక రోల్స్ చేశారు. ఈ చిత్రానికి థమన్ బీజీఎం అందించారు. శ్రీచరణ్ పాకల, రామ్ మిర్యాల సాంగ్స్ కంపోజ్ చేశారు.
Also Read:Happy Days Actress Appu: అసలు గుర్తు పట్టలేనంతగా మారిపోయిన హ్యాపీ డేస్ అప్పు… ఇప్పుడేం చేస్తుందంటే!