Malaika Arora: ఐటెం భామగా మలైకా అరోరాకు వెండితెరపై ఘనమైన చిత్ర ఉంది. కెరీర్ లో ఆమె ఆల్ టైం హిట్ సాంగ్స్ లో నటించారు. చెయ్య చెయ్య.., రంగీలా మారో డోలనా, మున్నీ బద్నామ్ హుయీ వంటి జనాలను ఊపేసిన సాంగ్స్ ఆమె లిస్ట్ లో ఉన్నాయి. తెలుగులో అతిథి, గబ్బర్ సింగ్ చిత్రాల్లో మలైకా ఐటెం సాంగ్స్ చేయడం విశేషం.
కెరీర్ బిగినింగ్ లోనే మలైకా వివాహం చేసుకున్నారు. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ తో 1998లో మలైకా వివాహం జరిగింది. చాలా కాలం క్రితమే విడిపోయిన మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్ 2017లో విడాకులు తీసుకొని అధికారికంగా విడిపోయారు. అర్జున్ కపూర్ తో ఎఫైర్ కారణంగానే మనస్పర్థలు తలెత్తాయనే పుకారు ఉంది.
Also Read: Happy Days Actress Appu: అసలు గుర్తు పట్టలేనంతగా మారిపోయిన హ్యాపీ డేస్ అప్పు… ఇప్పుడేం చేస్తుందంటే!
ప్రస్తుతం అర్జున్ కపూర్ తో ఆమె బంధం బహిరంగ రహస్యం. 48 ఏళ్ల మలైకాకు 19 ఏళ్ల కొడుకు అర్హాన్ ఖాన్ ఉన్నాడు. విడాకుల తర్వాత అతడు మలైకాతోనే ఉంటున్నాడు. ఇక అర్జున్ కపూర్ ఏజ్ 36 ఏళ్ళు కాగా 12 ఏళ్లు పెద్దదైన మలైకాతో డేటింగ్ చేస్తున్నాడు. పెళ్ళై విడాకులు తీసుకున్న మలైకా అరోరాతో అర్జున్ కపూర్ ప్రేమ బంధం బాలీవుడ్ వర్గాల్లో ఎప్పటి నుండో హాట్ టాపిక్.
ఇక ఫిట్నెస్ కోసం మలైకా క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేస్తారు. ఆమె 50 ఏళ్లకు దగ్గరయ్యారంటే నమ్మడం కష్టమే. అంత జాగ్రత్తగా అందం, ఆరోగ్యం కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక కష్టపడి సాధించిన వంపు సొంపులు సోషల్ మీడియా వేదికగా విందు చేస్తుంది. కరణ్ జోహార్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న మలైకా డ్రెస్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
బ్రాను పోలిన టాప్ ధరించిన మలైకా కోట్, షార్ట్ ధరించి సూపర్ సెక్సీగా దర్శనమిచ్చారు. మలైకా సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా ఫ్యాన్స్ క్రేజీ ఫీల్ అవుతున్నారు. కామెంట్స్ రూపంలో తమ ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు. మలైకా ఇంస్టాగ్రామ్ ఫొటోస్ తరచుగా వైరల్ అవుతున్నాయి.
Also Read:Mahesh-Rajamouli Movie: మహేష్-రాజమౌళి మూవీ సెట్ అయ్యింది ఎవరి వల్లనో తెలుసా?