
బీజేపీ తన ప్రతిష్టను పెంచుకునేందకు ప్రయత్నిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికార పార్టీని దెబ్బ కొట్టాలని చూస్తోంది. అందుకనుణంగా ప్రణాళికలు రచిస్తోంది. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అన్ని దారులుు వెతుకుతోంది. దీంతో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు హైదరాబాద్ చార్మినార్ లోని భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఖరారైపోయింది. ఆగస్టు 9 నుంచి అక్టోబర్ 2 వరకు రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ మీదుగా హుజురాబాద్ వరకు నిర్వహించనున్నారు.
అయితే బండి సంజయ్ దూకుడుకు కళ్లెం వేయాలని కొందరు భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. సొంత పార్టీలోనే వేరు కుంపట్లు రగులుతున్నట్లు సమాచారం. ఇందులో రెండు వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వర్గం పాదయాత్ర జరగకుండా చూసేందకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాబోయే ముఖ్యమంత్రి బండిసంజయ్ అని ఇప్పటికే పలువురు పేర్కొనడంతో కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పార్టీలో పట్టు ఉండడంతో సంజయ్ కు నేరుగా సంబంధాలు ఉండకుండా చేస్తున్నారనేది పలువురి వాదన. ఏది ఏమైనా పాదయాత్రతో బీజేపీప్రతిష్ట మరింత ఇనుమడించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
పాదయాత్ర కొనసాగింపుపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలోని కొందరు పాదయాత్ర నిర్వహించకుండా చేసేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. పార్టీ బలం పెరగాలంటే చేస్తున్న కార్యక్రమాలపై ఊపు వచ్చేలా చేయాలే కానీ ఆపు చేసేలా ఉండకూడదని పలువురు చెబుతున్నారు. అయినా పాదయాత్ర ఏ మేరకువిజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.
తెలంగాణలో అటు అధికార టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలను తొక్కి పెట్టాలంటే వాటికి మించిన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. అందుకే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేసేందుకు ముందకు కదిలారు. రోడ్ మ్యాప్ ఖరారు చేసుకుని పాదయాత్ర వెంట పార్టీల విధానాలు ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేసే క్రమంలో పార్టీని అధికార పీఠం ఎక్కేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.